groom kissing bride marriage cancellation
UP bridegroom: వరకట్నం నేరమని తెలిసినప్పటికీ, ఆ సాంఘిక దురాచారం కొనసాగుతూనే ఉంది. ఇక వరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పెళ్లి కూతురి తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు కట్నం ఇవ్వడానికి కూడా వెనకాడరు. మంచి ఉద్యోగం ఉంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వీలైనంత ఎక్కువ కట్నం అడగాలని చూస్తారు. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే యువకులు చాలా అరుదుగా కనపడతారు. డబ్బు మైకంలో మునిగి తేలుతున్న సమాజ కళ్లు తెరిపించేలా మంచితనాన్ని చాటుకుంటారు.
అటువంటి యువకుడే ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన సౌరవ్ చౌహాన్. లేఖ్ పాల్ లో ఆయన రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాడు. తితావీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖాన్ గ్రామంలో ఓ రిటైర్డ్ ఆర్మీ జవాను కూతురితో సౌరవ్ పెళ్లి వేడుక జరిగింది. అంతకు ముందు పెళ్లి కొడుకుకి కట్నంగా పెళ్లి కూతురి తల్లిదండ్రులు రూ.11 లక్షల నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చారు.
Bangladesh vs India: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోలు పోస్ట్ చేసిన షమీ
పెళ్లి తర్వాత ఆ కట్నం మొత్తాన్ని పెళ్లి కొడుకు తిరిగి పెళ్లి కూతురి తల్లిదండ్రులకు ఇచ్చేశాడు. పెళ్లి జరిగినందుకు శుభసూచకంగా రూ.1 మాత్రమే తీసుకున్నాడు. దీంతో గ్రామస్థులు అందరూ పెళ్లి కొడుకు చేసిన పనిని ప్రశంసించారు. ఆ యువకుడిని స్ఫూర్తిగా తీసుకుని వరకట్న దురాచారాన్ని రూపుమాపాలని అన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..