UP Cabinet expansion : నవరాత్రివేళ యూపీ మంత్రివర్గ విస్తరణ…కొత్తవారికి చోటు

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విస్తరణ అక్టోబర్ 15 వతేదీన ప్రారంభమయ్యే నవరాత్రి నాటికి జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఓం ప్రకాష్ రాజ్‌భర్, దారా సింగ్ చౌహాన్ లను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు వెలువడ్డాయి....

UP Cabinet expansion

UP Cabinet expansion : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విస్తరణ అక్టోబర్ 15 వతేదీన ప్రారంభమయ్యే నవరాత్రి నాటికి జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఓం ప్రకాష్ రాజ్‌భర్, దారా సింగ్ చౌహాన్ లను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ విస్తరణ నవరాత్రి నాటికి జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో భాగమైనప్పటి నుంచి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Also Read :CM KCR : కేసీఆర్ దూకుడు.. ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు

దారా సింగ్ చౌహాన్ సమాజ్ వాదీ పార్టీని వదిలి బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన మంత్రి అవుతారని భావిస్తున్నారు. కేబినెట్‌లో చాలా మందిని సీఎం యోగి తప్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొందరు మంత్రుల వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారని, వారిని మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Also Read :KTR : అబద్దాల అమిత్ షా పార్టీకి గుణపాఠం తప్పదు, 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు- కేటీఆర్

2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహానికి అనుగుణంగానే మంత్రివర్గ మార్పులు ఉంటాయని పార్టీ పేర్కొంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ చౌహాన్‌కు కేబినెట్‌ లో స్థానం దక్కుతుందని అంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో యూపీలోని తూర్పు ప్రాంతంలో తన ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు దారా సింగ్ చౌహాన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని బీజేపీ చూస్తోంది.