స్కూళ్లో సీటు కోసం గొడవ, కాల్పులు జరిపిన విద్యార్థి, ఒకరు మృతి

UP Class 10 Student Kills Classmate In School : స్కూళ్లో సీటు కోసం జరిగిన గొడవలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా గన్ తో కాల్పులు జరపడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూంలో సీటు కోసం గొడవ పడ్డారు. తన ప్లేస్ అంటే..తన ప్లేస్ అంటూ వాదించుకున్నారు. తర్వాత..ఒక విద్యార్థి..ఇంటికి వెళ్లాడు. గన్ ను తీసుకొచ్చి..గొడవకు దిగిన విద్యార్థిపైకి కాల్పులు జరిపాడు.

రక్తపు మడుగులో ఆ విద్యార్థి కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉపయోగించిన గన్…అంకుల్ దని తెలిసింది. ఇతను ఆర్మీలో పని చేస్తాడని, ఇటీవలే ఇంటికి వచ్చాడని పోలీసులు గుర్తించారు. ఆయనకు తెలియకుండా సదరు విద్యార్థి..గన్ తీసుకొచ్చి కాల్పులు జరిపాడని పోలీసు ఆఫీసర్ సంతోష్ కుమార్ సింగ్ వెల్లడించారు. మూడు రౌండ్లు కాల్పులు జరపాడని, తల, చాతి, కడుపులో బుల్లెట్లు దూసుకపోవడంతో విద్యార్థి చనిపోయాడన్నారు.