UP Cop forgot How to load Gun : సినిమాల్లో పోలీసులు తుపాకులతో మోత మోగిస్తుంటారు. సాధారణ తుపాకులే కాదు ఏకే 47లతో హల్ చల్ చేస్తుంటారు. అదే నిజజీవితంలో పోలీసులు వారి వద్ద ఉండే తుపాకులను ఉపయోగించే అవసరం పెద్దగా రాదు. దీంతో వారి వద్ద ఉండే తుపాకులు అసలు పేలతాయా? ఆ తుపాకులతో కాల్చటం పోలీసులకు వచ్చా? అనే జోకులు వేసుకుంటుంటారు సామాన్య జనాలు. మరి పోలీసులకు తుపాకులు ఉపయోగించటం వచ్చా? రాదా? అసలు తుపాకీలో బుల్లెట్ లోడ్ చేయటమన్నా వచ్చా? అంటే ఇదిగో ఈ పోలీస్ ఇన్ స్పెక్టర్ తుపాకీలో తూటా (బుల్లెట్) లోడు చేయటానికి పడే పాట్లు చూస్తే కాస్త అనుమానించాల్సిందే. పాపం తుపాకీలో తూటాని ఎక్కడ లోడ్ చేయాలో కూడా మర్చిపోయినట్లున్నాడు ఈ ఎస్సై..ఆ ఎస్సై తుపాకీలో తూటాని లోడ్ చేయటానికి పడి పాట్లు చూస్తే నవ్వాగదు..
పోలీసులకు ట్రైనింగ్ సమయంలో తుపాకులతో పాటు అనేక రకాల ఆయుధాల వినియోగంలో తర్ఫీదు ఇస్తారు. కానీ వారికి పోస్టింగ్ వచ్చాక డ్యూటీ చేసే సమయంలో వాటిని ఉపయోగించే అవకాశాలు..సందర్భాలు ఉండవనే చెప్పాలి. అందుకే అప్పుడప్పుడు ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ పోలీసు సిబ్బంది తుపాకులు వినియోగించే పద్ధతిని పరీక్షిస్తుంటారు. అలా ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఎస్పీ ఖలీలాబాద్ ఓ పోలీసు స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. ఈ స్టేషన్ లో పోలీసులను పరీక్షించారు. దీంట్లో భాగంగానే ఆ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇన్ స్పెక్టర్ కు తుపాకీ ఇచ్చి తుపాకీలో తూటా లోడ్ చేయమన్నారు. పాపం మర్చిపోయినట్లున్నాడు ఎస్సై తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో అసలు ఎక్కడ లోడ్ చేయాలో కూడా కూడా తెలియక బిత్తరచూపులు చూశాడు. నవ్వులపాలయ్యాడు. షాట్ గన్ ను ఆ ఎస్సై చేతికిచ్చిన ఎస్పీ ఓ షాట్ కాల్చాలని ఆదేశించారు. తూటా కూడా అందించారు. కానీ పాపం ఆ ఎస్సైకి తూటా లోడ్ చేయటం కూడా చేతకాలేదు. దీంతో అక్కడే ఆ ఎస్సై వెనుకాల నిలబడ్డ మరో పోలీసులు నవ్వటం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఎస్సీ ఇచ్చిన తుపాకీ అందుకున్న సదరు ఎస్సై… తూటాను ఆ తుపాకీలో ఎక్కడ లోడ్ చేయాలో తెలియక దిక్కులు చూశాడు. చివరికి ఆ తూటాను తుపాకీ గొట్టం ముందు భాగంలోంచి లోడ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే తుపాకీ ముందుకు వంచగానే ఆ తూటా ముందుకు జారి చేతులోకి వచ్చేసింది. దాంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. చివరికి ఆ సబ్ ఇన్ స్పెక్టర్ పరిస్థితి చూసి ఎస్పీకి కూడా నవ్వొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కనీసం తుపాకీ ఎలా కాల్చాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు ఈ వీడియో చూసినవారంతా..ప్రతిపక్ష నాయకులు యూపీ సీఎం యోగి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.
योगी जी की पुलिस को बंदूक में गोली डालना भी नहीं आता!
यूपी पुलिस बंदूक की नली से डाल रही गोली, चरम पर अज्ञानता।
भाजपा सरकार में गरीबों और निर्दोषों का उत्पीड़न करने वाली अनुशासनहीन पुलिस के एसआई को बंदूक चलाना भी नहीं आता, शर्मनाक।
ऐसे पुलिसकर्मियों से बेहतर होगी पुलिस फोर्स? pic.twitter.com/fbCMy5dmsy
— Samajwadi Party (@samajwadiparty) December 28, 2022