Up Elephant Will Be Released On Parole
elephant will be released on parole : ఓ హత్యకేసులో ఓ ఏనుగు శిక్ష అనుభవిస్తోంది. ఏనుగేంటీ హత్య చేయటమేంటీ? శిక్ష అనుభవించటమేంటీ అనే అనుమానం రావచ్చు. కానీ ఇది నిజమే. ఓ ఏనుగు ఓ హత్యకేసులో గత 18 నెలలుగా శిక్ష అనుభవిస్తోంది. మిథు అనే పేరుగల మగ ఏనుగుకు ఎట్టకేలకు పెరోల్‌పై బయటకు రానుంది. అనారోగ్యంతో బాధపడుతున్న మిత్తూకు ఇన్నాళ్టికి పెరోల్ లభించటంతో దాన్ని త్వరలోనే పార్కులో విడిచిపెట్టనున్నారు.
2020 అక్టోబరు 20న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రదర్శన ఇచ్చి తిరిగి వస్తున్న సమయంలో మిథుని బాబూరి ప్రాంతంలో కొంతమంది ఆకతాయిలు వేధించారు. ఎంతో సేపు ఆకతాయిల వేధింపుల్ని..హింసల్ని భరించిన మిథుని వాళ్లు వదల్లేదు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన మిత్తూ వారిపై దాడిచేసింది. ఈ దాడిలో విషయం అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో పోలీసులు ఏనుగుపైనా..దాని మావటిపై కూడా హత్యానేరం కేసు నమోదు చేశారు. అనంతరం మిథుతో పాటు మావటిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత మావటికి బెయిలు లభించినప్పటికీ వ్యక్తిని చంపినందుకు మిథుకు మాత్రం శిక్ష పడింది. దీంతో దానిని బీహార్‌లోని చందౌలీ రాంనగర్ అటవీ జంతు సంరక్షణాలయ పర్యవేక్షణలో ఉంచారు. అప్పటి నుంచి మిథూ అక్కడే బందీగా ఉండిపోయింది. దాని బాగోగుల గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో మిథు అనారోగ్యం బారినపడింది. సరిగా నడవలేకపోతోంది.
ఈ విషయాన్ని జూ డైరెక్టర్ రమేష్ పాండే ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ సతీష్ గణేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వారణాసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా మిథూని పెరోల్‌పై బయటకు తీసుకురావాలని కలెక్టర్ భావించారు. దీంతో మిథూకి పెరోల్ లంభిచింది. దాన్ని త్వరలోనే లిఖింపూర్ ఖేరీలోని దుద్వా జాతీయ పార్కులో విడిచిపెట్టనున్నారు.