ఉత్తరప్రదేశ్ లోని జైలు ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించాల్సిందేనని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ప్రకటించింది. బాడీ కెమెరాల పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖకు రూ.80 లక్షలు మంజూరుచేసినట్లు యూపీ ప్రిజన్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం తెలిపింది.
జైలు ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు కెమెరాలు ధరించడం వల్ల హింసాత్మక నేరపూరిత చర్యలు, డ్రగ్స్ తీసుకోవడం, ఆత్మహత్యలు, జైలు భద్రతకు సంబంధించిన సమస్యలను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. అయితే దీనివల్ల ఖైదీలు, సిబ్బంది వ్యక్తిగత గోప్యతకు ఎలాంటినష్టం జరగదని చెప్పారు.
కెమెరాల నిర్వహణ, పర్యవేక్షణ, రికార్డింగ్, డాటా స్టోరేజీ కోసం సంబంధిత జైళ్లలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తారని, దానికి ఒక సీనియర్ అధికారిని ఇన్‌చార్జిగా నియమిమస్తారని తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జైలు సిబ్బందికి బాడీ కెమెరాల ఏర్పాటుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనుతిచ్చారు.