లవ్ జిహాద్ పేరుతో..జంటను రాత్రంతా పీఎస్ లోనే ఉంచి..యువకుడిని చావబాదిన పోలీసులు

  • Publish Date - December 12, 2020 / 10:01 AM IST

UP ‘Love jihad’ rumour Muslim couple overnight at ps : లవ్ జిహాద్ వివాదంగా మారుతోంది. తీవ్ర విద్వేషాలకు కారణంగా తయారైంది. ముఖ్యంగా యూపీలో లవ్ జీహాద్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఇది పెద్ద ప్రమాదంగా మారుతోంది. ప్రేమ పేరుతో బలవంత మతమార్పిడులకు పాల్పడుతున్నారనే కారణంతో వారిపై దాడులు జరుగుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే లవ్ జీహాద్ అనే పుకార్లతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ ముస్లిం వ్యక్తిని..హిందూ యువతిని రాత్రంతా పోలీసు స్టేషన్ లోనే నిర్భందించి ఉంచేశారు.

ఖుషీ నగర్ లో పోలీసులు లవ్ జిహాద్ నేపథ్యంలో ఓ పెళ్లిని ఆపేశారు. ఓ ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని మతమార్పిడి చేసి పెళ్లాడబోతున్నాడంటూ పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. దాంతో పోలీసులు హైదర్ అలీ 36ఏళ్ల వ్యక్తితో పాటు ఓ అమ్మాయిని కూడా తీసుకువచ్చి కస్యా పోలీస్ స్టేషన్ లో రాత్రంతా ఉంచారు.

ఆ మరుసటి రోజు సదరు యువతి సోదరుడు వచ్చి పోలీసులతో మాట్లాడడంతో అసలు విషయం వెల్లడైంది. ఆ వ్యక్తితో పాటు యువతి కూడా ముస్లిం యువతి అని తెలిసింది. ఆమె పేరు షబీలా ఖాతూన్ అనీ..వయస్సు 28ఏళ్లని తెలిసింది. దీంతో పోలీసులు తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు.

హైదర్ అలీదీ, షబీలా ఖాతూన్ ది ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నారు. క్షురకుడిగా పనిచేసే హైదర్ అలీకి గతంలో వివాహం కాగా..భార్య చనిపోయింది. ఈక్రమంలో షబీలాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. గత మంగళవారం (డిసెంబర్ 10,2020)మధ్యాహ్నం పెళ్లి చేసుకునే క్రమంలో పోలీసులు హైదర్ అలీదీ, షబీలా ఖాతూన్ లను పీఎస్ కు తీసుకొచ్చి రాత్రంతా నిర్భంధించారు.

అనంతరం అలీ కొత్త జీవితంలోనే అడుగు పెడుతున్న శుభసందర్భంగా స్నేహితులకు..ఆత్మీయులకు పార్టీ ఇస్తుండగా పోలీసులు వచ్చి హిందూ అమ్మాయిని బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణతో తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో అలీ చెప్పేదేమీ పోలీసులు వినిపించుకోలేదు. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తనను బెల్టుతో విచక్షణ రహితంగా కొట్టారని హైదర్ అలీ వాపోయాడు. పోలీసులు మాత్రం తామేమీ అతడిని కొట్టలేదని అంటున్నారు.

ఇద్దరూ మేజర్లని తెలిసిందని..పైగా ఒకే మతానికి చెందినవారు కావడంతో తామేమీ అభ్యంతరం పెట్టటంలేదనీ…ఇద్దరీని విడిచిపెట్టేస్తామని తప్పించుకున్నారు. దీనిపై షబీలా సోదరుడు మాట్లాడుతూ..తన సోదరికి ఈ పెళ్లి ఇష్టమైతే తమకేమీ ఇబ్బందిలేదని తెలిపాడు. అనంతరం బుధవారం వారి వివాహం జరిగింది.

లవ్ జీహాద్ పేరుతో విషయం తెలుసుకోకుండా పోలీసులు ఇలా రాత్రంతా అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో నిర్భంధించటం ఏంటని ప్రశ్నించాడు.

లవ్ జీహాద్ పేరుతో ఇలా ముస్లింల మీద దాడులు చేయటం ఏంటని ప్రశ్నించాడు. మేజర్లైతే కులం మతం అడ్డురావని వారికి ఇష్టమైతే పెళ్లి చేసుకోవటానికి అభ్యంతరం లేని సాక్షాత్తు న్యాయస్థానాలే చెప్పిన తరువాత కూడా లవ్ జీహాద్ పేరుతో ఇలా దాడులు చేయటం..ఇష్టమొచ్చినట్లుగా అనుమానించి..ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని సూచించాడు.

ట్రెండింగ్ వార్తలు