No Antibodies After Jab: కరోనా టీకా తీసుకున్నా.. యాంటీబాడీలు రాలేదంటూ పోలీసులకు ఫిర్యాదు

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా తన శరీరంలో యాంటీబాడీలు తయారు కాలేదంటూ యూపీకి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

No Antibodies After Jab : కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా తన శరీరంలో యాంటీబాడీలు తయారు కాలేదంటూ యూపీకి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీకాల పేరిట తనను మోసం చేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. యూపీలోని ఆషియానా ప్రాంతానికి చెందిన ప్రతాప్ చంద్ర పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.

ఏప్రిల్ 8న ఆషియానాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కొవిషీల్డ్ మొదటి మోతాదును తీసుకున్నాడు. 28 రోజుల తరువాత రెండవ షాట్ పొందవలసి ఉంది. కానీ, ఎక్కువ గ్యాప్ సూచించడంతో వేచి ఉన్నాడు. మొదటి మోతాదు పొందిన తరువాత అనారోగ్యంతో ఉన్నానని చెప్పాడు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి మోతాదు తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. కానీ, కొవాక్సిన్‌తో తగినంత మోతాదులో రోగనిరోధక ప్రతిస్పందన రెండవ మోతాదు తర్వాత మాత్రమే ఉంటుందని తెలిసింది. ఆ తర్వాత మే 25న ఐసిఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబ్‌లో కొవిడ్ -19 కోసం యాంటీబాడీ పరీక్ష చేయించుకోవాలని చంద్ర భావించాడు. అతని బ్లడ్ శాంపిల్స్ సేకరించడానికి ల్యాబ్ సిబ్బందిని పంపింది.

మే 27న తనకు నెగటివ్ రిపోర్టు వచ్చింది. టీకా తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీ అభివృద్ధి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్లేట్‌లెట్ లెక్కింపు 3 లక్షల నుంచి 1.5 లక్షలకు తగ్గింది. టీకా పేరిట నన్ను మోసం చేశారని మండిపడ్డాడు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని వాపోయాడు. బాధితుడి ఫిర్యాదును ఆషియానాలో స్పీకరించగా.. సిఎంఓ లక్నోకు పంపుతామని అధికారులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు