UP Panchayat Election 2021 : నువ్వు దేవుడు సామీ.. ఊరి జనాల కోసం ఇష్టం లేకపోయినా 45ఏళ్ల వయసులో పెళ్లి

అతడి వయసు 46ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. అసలు వివాహం చేసుకునే ఉద్దేశమే అతడికి లేదు. కానీ, ఓ బలమైన సంకల్పం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఊరి జనాల కోసం పెద్ద త్యాగమే చేశాడు. ఇంతకీ ఏం చేశాడో తెలుసా.. అతగాడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో.. నువ్వు దేవుడు సామీ అని ఊరి జనాలు అతడికి కీర్తిస్తున్నారు.

UP Panchayat Election 2021 : అతడి వయసు 45ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. అసలు వివాహం చేసుకునే ఉద్దేశమే అతడికి లేదు. కానీ, ఓ బలమైన సంకల్పం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఊరి జనాల కోసం పెద్ద త్యాగమే చేశాడు. ఇంతకీ ఏం చేశాడో తెలుసా.. అతగాడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో.. నువ్వు దేవుడు సామీ అని ఊరి జనాలు అతడిని కీర్తిస్తున్నారు.

మ్యాటర్ లోకి వెళితే.. యూపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, ఓ చోట సర్పంచి పదవిని మహిళకు రిజర్వ్ చేశారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి ఊరికి పెద్ద కావాలనే కోరికతో 45ఏళ్ల వయసులోనూ ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. తనకు బదులుగా తన భార్యను బరిలోకి దింపాడు. ఈ సమయంలో పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు లేనప్పటికీ వివాహం చేసుకున్నాడు.

బాలియా జిల్లాలోని కరణ్‌చప్రా గ్రామానికి చెందిన హథీ సింగ్(45) కొన్ని సంవత‍్సరాలుగా గ్రామంలో సామాజిక సేవ చేస్తున్నాడు. ఊరికి పెద్ద కావాలనేది అతడి కల. సర్పంచ్ అని పిలిపించుకోవాలన్నది అతడి కోరిక. గత ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసినప్పటికీ విజయం దక్కలేదు. గ్రామాభివృద్ధికి ఎంతగానో పాటు పడుతున్న హథీ సింగ్‌ ఈ ఏడాది జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నాడు. తీరా చూస్తే, రిజర్వేషన్‌ రూపంలో అతనికి ఆటంకం ఎదురైంది.

ఆ గ్రామానికి సర్పంచ్‌గా మహిళను రిజర్వ్ చేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక సింగ్ తలపట్టుకున్నాడు. పోనీ ఇంట్లో ఎవరినైనా బరిలోకి దింపుదామా అంటే, మహిళలు లేరు. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. పైగా అతడికి తల్లికి 80ఏళ్లు. ఈ వయసులో ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం అసాధ్యం. ఏం చేయాలో పాలుపోక సింగ్ మదనపడుతుంటే.. ఇంతలో అతడి మద్దతుదారులు, సహచరులు ఓ సూచన చేశారు. పెళ్లి చేసుకోవాలని చెప్పారు. తన కల నెరవేరాలంటే అదొక్కటే మార్గం అని భావించిన సింగ్ వెంటే ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకున్నాడు.

”గ్రామానికి మూడో దశలో భాగంగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13 లోపు నామినేషన్ సమర్పించాలి. అందుకే మంచి ముహుర్తం లేనప్పటికీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కానీ గ్రామ అభివృద్ధి కోసమే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది” అని హథీ సింగ్ తెలిపాడు. మరి, ఇష్టం లేకున్నా 45ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని పెద్ద త్యాగం చేసిన సింగ్.. సర్పంచ్ పదవి కల నెరవేరుతుందో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు