Sanjay Nishad: దేశంలో మతపరమైన ఉన్మాదం వ్యాపించింది.. యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మౌలానాలతో కలిసి దేశంలో మత ఉన్మాదాన్ని విపక్షాలు రెచ్చగొడుతున్నాయని, అల్లర్లకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక ఇలాంటివి తగ్గుముఖం పట్టాయని సంజయ్ నిషాద్ పేర్కొన్నారు. మౌలానాలు దేశంలో పేదరికాన్ని పెంచారని, వారి వల్లనే ముస్లిం పిల్లలు చదువుకు దూరమయ్యారని నిషాద్ పార్టీ నాయకుడు అన్నారు

Sanjay Nishad: గుడులకు సమీపంలో ఉండే మసీదులను తొలగించాలని ఉత్తరప్రదేశ్ మంత్రి, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఓ సందర్భంలో మీడియా మాట్లాడుతూ భారతదేశంలో మతపరమైన ఉన్మాదం వ్యాపిందని, అందుకే గుడులకు సమీపంలో ఉండే మసీదులను తొలగించాలని ఆయన అన్నారు. ఇక మదర్సాలపై ఆయన మరింత వివాదాస్పదంగా స్పందించారు.

ఈ మధ్య కాలంలో ఓ సర్వే జరిగిన ఒక సర్వేను సంజయ్ నిషాద్ ఉదహరిస్తూ మదర్సాలు ఉగ్రవాద కార్యకలాపాలకు, ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని అన్నారు. ఈ మధ్య కాలంలో బయటపడుతున్న వాస్తవాలే ఇందుకు ఉదహారణ అని అన్నారు. మదర్సాలపై పడ్డ ఇలాంటి నీలి నీడల్ని ముస్లిం పెద్దలు ముందుకు వచ్చి పరిష్కరించాలని, దానికి తాను చేసిన సూచన ఉత్తమమని అన్నారు.

అనంతరం విపక్షాలపై ఆయన స్పందిస్తూ మసీదులపై చేసిన విమర్శల్నే ఎక్కు పెట్టారు. మౌలానాలతో కలిసి దేశంలో మత ఉన్మాదాన్ని విపక్షాలు రెచ్చగొడుతున్నాయని, అల్లర్లకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక ఇలాంటివి తగ్గుముఖం పట్టాయని సంజయ్ నిషాద్ పేర్కొన్నారు.

మౌలానాలు దేశంలో పేదరికాన్ని పెంచారని, వారి వల్లనే ముస్లిం పిల్లలు చదువుకు దూరమయ్యారని నిషాద్ పార్టీ నాయకుడు అన్నారు. ముస్లిం పిల్లలు చదువుకోవాలని, పైకి రావాలని మౌలానాలు అనుకోవడం లేదని సంజయ్ నిషాద్ విమర్శించారు.

PM Modi birthday : సెప్టెంబరు 17 ప్రధాని పుట్టిన రోజు .. నమీబియా నుంచి వచ్చిన చీతాలను కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేయనున్న మోడీ

ట్రెండింగ్ వార్తలు