Up 2021
Akhilesh Yadav – Shivpal Yadav : ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పొలిటికల్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో..ఇప్పటి వరకు పెడమొహంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు, తన బాబాయి ప్రగతి శీల సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు శివపాల్ యాదవ్ చేతులు కలిపారు. శివపాల్ యాదవ్ ఇంటికి అఖిలేశ్ యాదవ్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు వీరు 45 నిమిషాల పాటు సమావేశంలో పొత్తు అంశాలపై చర్చించారు. అనంతరం రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారయ్యిందంటూ..అఖిలేశ్ ట్వీట్ చేశారు.
Read More : Trivikram Srinivas : త్రివిక్రమ్ భార్య నృత్య ప్రదర్శన.. స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్
బాబాయితో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా పోస్టు చేశారు. కానీ..ఎవరెకెన్ని సీట్లనే విషయం తెలియరాలేదు. పార్టీల విలీనం అంశం కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ఎస్పీ వ్యవస్థాకులు ములాయం సింగ్ కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. వీరి పొత్తుపై బీజేపీ స్పందించింది. వారి వల్ల బీజేపీ విజయాన్ని అడ్డుకోలేదని…300కు పైగా స్థానాలు సాధించి…తిరిగి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేత, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
Read More : Amaravati Padayatra: అమరావతి రైతుల పాదయాత్ర.. నేటితో ముగింపు
2017 సంవత్సరంలో యూపీలో ఘోర పరాజయం తర్వాత..సమాజ్ వాదీ పార్టీ నుంచి శివపాల్ యాదవ్ బయటకు వచ్చారు. అఖిలేశ్ యాదవ్, ఆయన బాబాయి శివపాల్ యాదవ్ మధ్య అధిపత్యపోరు పతాక స్థాయికి చేరింది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ రెండుగా చీలిపోయింది. సొంతంగా ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. ఈ క్రమంలో..అఖిలేశ్ అకస్మికంగా గురువారం శివపాల్ యాదవ్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
प्रसपा के राष्ट्रीय अध्यक्ष जी से मुलाक़ात हुई और गठबंधन की बात तय हुई।
क्षेत्रीय दलों को साथ लेने की नीति सपा को निरंतर मजबूत कर रही है और सपा और अन्य सहयोगियों को ऐतिहासिक जीत की ओर ले जा रही है। #बाइस_में_बाइसिकल pic.twitter.com/x3k5wWX09A
— Akhilesh Yadav (@yadavakhilesh) December 16, 2021