ఎలుకకు కంటి ఆపరేషన్..25 గ్రాముల కణితి తొలగించిన డాక్టర్

  • Publish Date - October 28, 2020 / 03:39 PM IST

UP rat eye operation 25 gm tumor removed : కంటిసమస్యలు కేవలం మనుషులకేనా జంతువులకు రావా? అంటే కాస్త ఆలోచించాల్సిందే..ఎందుకంటే జంతువులు ఎక్కడ కళ్లజోడు పెట్టుకున్నట్లుగా ఎక్కడా చూడలేదు..అలాగే అవి ఆపరేషన్ చేయించుకున్నట్లు చూడలేదు.


కానీ జంతువులకు కూడా కంటి సమస్యలుంటాయనీ..కంటిచూపు కోల్పోయి ఇబ్బందులు పడతాయి. ఓ తెల్లటి ఎలుక కంటి సమస్యలతో బాధపడుతూ ఆహారం కోసం అది పడుతున్నపాట్లు గ్రహించిన ఓ వ్యక్తి దానికి ఆపరేషన్ చేయించటంతో జంతువులు కూడా కంటి సమస్యలతో బాధపడతాయనే విషయం మరోసారి తేలింది. ఓ తెల్ల ఎలుకను చూసిన ఓ వ్యక్తి అదేదో తేడాగా ఉందని గ్రహించిన ఓ వ్యక్తి దాన్ని పట్టుకుని పశువుల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాడు. ఆ ఎలుక కంటిలో ఉన్న 25 గ్రాముల కణితిని తొలగించి కంటి సమస్యను తీర్చి ప్రాణం పోసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.


వివరాల్లోకి వెళితే..నుమాయిష్ గ్రౌండ్ నివాసి అమిత్ కుమార్‌‌కు కొద్ది రోజుల క్రితం తన ఇంటి సమీపంలో ఒక తెల్ల ఎలుక కనిపించింది. అది గందరగోళంగా అటూ ఇటూ తిరుగుతు ఎటు వెళ్లాలో తెలీక నానా అగచాట్లు పడటం చూశాడు. దానికి ఏదో సమస్య ఉందని గుర్తించి డాక్టర్ అమిత్ దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు.


దానికి ఆహారం పెట్టాడు. కానీ అది ఏమీ తినలేకపోయింది. దీంతో ఆ ఎలుకను పరిశీలనగా చూసిన అమిత్ దాని కంట్లో ఏదో సమస్య ఉందని గుర్తించాడు. ఆ ఎలుకకు కంటిలో ఏదో సమస్య ఉన్నదని గ్రహించాడు. కంటి చూపు సరిగా కనిపించక అది ఆహారం వెతుక్కోలేక కొంతకాలంగా ఏమీ తినలేకపోతోందని అందుకే అది బక్కగా అయిపోయిందని గ్రహించాడు.


దీంతో అమిత్ తెల్ల చిట్టెలుకను సురేంద్ర నగర్‌లోని వెటర్నరీ డాక్టర్ విరామ్ వైష్నోయ్ దగ్గరకు తీసుకువెళ్లాడు. దానిని పరిశీలించిన డాక్టర్ ఆ ఎలుక కంటిలో ట్యూమర్ ఉందని గుర్తించి ఆపరేషన్ చేశారు. రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి..ఆ తెల్ల ఎలుక కంటిలో ఉండే 25 గ్రాముల కణతిని తొలగించారు.



ఆపరేషన్ జరిగిన ఓ గంటసేపటికి ఆ ఎలుక కోలుకుంది. ఆ ఎలుకను అమిత్ తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ తెల్ల చిట్టెలుక పూర్తి ఆరోగ్యంతో చురుగ్గా అమిత్ ఇంట్లో చకచకా తిరిగేస్తోంది. దాన్ని మంచి ఆహారం పెడుతు చక్కగా చూసుకుంటున్నాడు అమిత్.