Job offer: ఐఐటీ, ఐఐఎంలో చదవలేదు.. అయినా మొదట 32 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఇప్పుడు 56 లక్షలతో..

ఓ మారుమూల గ్రామంలో ఆరాధ్య జన్మించింది. చిన్నప్పటి నుంచి చదువులో బాగా రాణించింది.

Aradhya Tripathi

Aradhya Tripathi: కొందరు విద్యార్థులు ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవకపోయినా భారీ వేతనంతో ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటున్నారు. నైపుణ్యాలు ఉంటే చాలు.. లక్షలాది రూపాయల వేతనాలను ఆఫర్ చేస్తూ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి.

ఆరాధ్య త్రిపాఠి అనే యువతి కూడా ఇలాంటి ఘనతే సాధించింది. ఉత్తర ప్రదేశ్‌, గోరఖ్‌పూర్‌లోని మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఆరాధ్య త్రిపాఠి చదివింది. యూపీలోని మఘర్ ప్రాంతంలోని గోత్వా గ్రామానికి చెందిన ఆమెకు గూగుల్‌లో రూ.56 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది.

మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదివి వారిలో ఇంత పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించుకున్న వారు ఇప్పటివరకు ఎవరూ లేరు. ఆరాధ్య త్రిపాఠి తండ్రి అడ్వకేట్.. ఆమె తల్లి గృహిణి. స్కూలు నుంచే ఆరాధ్య బాగా చదివేది. ఎంఎంఎంయూటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసింది.

గూగుల్‌లో ఆమె ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరనుంది. బీటెక్ పూర్తయ్యాక ఆమె స్కేలర్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. ఆమెకు ఆ కంపెనీ రూ.32 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం ఆఫర్ చేసింది. ఇప్పుడు అంతకంటే పెద్ద ప్యాకేజీతో గూగుల్‌లో ఉద్యోగం రావడంతో ఆమెపై లెక్చరర్లు, మిత్రులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Also Read

రూ.85 లక్షల ప్యాకేజీతో జాబ్ సాధించిన అమ్మాయి