Sania Mirza India 1st Muslim Woman Fighter Pilot : ఫైటర్‌ పైలట్‌గా టీవీ మెకానికర్ కూతురు..వైమానిక దళ చరిత్రలో తొలి ముస్లిం యువతి ‘సానియా మీర్జా’ ఘనత

సానియా మీర్జా అంటే గుర్తుకొచ్చేది టెన్నిస్ స్టార్. కానీ యూపికి చెందిన ఈ సానియా మీర్జా మాత్రం భారత వైమానిక దళ చరిత్రలో తొలిసారి ఓ ముస్లిం యువతి ఫైటర్ పైలెట్ గా సరికొత్త చరిత్రను లిఖించింది. యూపీలోని కుగ్రామంలోపుట్టిన ఈసానియా మీర్జా టీవీ మెకానిక్ కూతురు. పేదరికాన్ని జయించి ఫైటర్ పైలెట్ స్ఠాయికి చేరుకుంది.

Sania Mirza India 1st Muslim Woman Fighter Pilot : సానియా మీర్జా అంటే గుర్తుకొచ్చేది టెన్నిస్ స్టార్. కానీ యూపికి చెందిన ఈ సానియా మీర్జా మాత్రం భారత వైమానిక దళ చరిత్రలో తొలిసారి ఓ ముస్లిం యువతి ఫైటర్ పైలెట్ గా సరికొత్త చరిత్రను లిఖించింది. యూపీలోని కుగ్రామంలోపుట్టిన ఈసానియా మీర్జా టీవీ మెకానిక్ కూతురు. పేదరికంలో పుట్టినా తను కన్న కలల్ని సాకారం చేసుకోవానికి తీవ్రంగా కృషి చేసింది.ఆ కృషికి ఫలితంగా వైమానిక దళ చరిత్రలో తొలిసారి ఓ ముస్లిం యువతిగా ఫైటర్ పైలట్‌గా ఎంపికై సరికొత్త చరిత్రను సృష్టించింది సానియా. హిందీ మీడియంలో చదివిన సానియా డిసెంబరు 27న పుణె ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ కోసం సానియా చేరనుంది.

సానియా మీర్జాపూర్ జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టిన సానియా భారత్ తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌ అవని చతుర్వేదిని ఆదర్శంగా తీసుకుంది. ఆమెలా ఎప్పటికైనా పైలెట్ కావాలని కలలు కనేది. ఎప్పుడు అదే ధ్యాస..అలా పట్టుదలకు కేరాఫ్ గా మారింది. ఇంటర్ పరీక్షల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆ తరువాత తన కలలను నెరవేర్చుకోవటానికి సెంచూరియన్ డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంది.

సానియా మీర్జాపూర్‌లోని సెంచూరియన్ డిఫెన్స్‌ అకాడమీలో చేరి శిక్షణ తీసుకుని ఎన్డీఏ పరీక్షలకు హాజరయ్యింది. ఇటీవల విడుదల అయిన ఫలితాలు కూడా ఆమెను గెలిచేలా చేశాయి. ఫలితాల్లో 149వ ర్యాంక్‌ను సాధించిన సానియా.. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌ కావాలన్న కలను సాకారం చేసుకుంటోంది. ఓ పుట్టుకతోనే చరిత్ర కూడా పుడుతుంది అది వారి కృషి వల్ల ఈ ప్రపంచానికి పరిచయమవుతుంది అనే మాటను సానియా నిజం చేసింది. దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా.. యూపీ నుంచి తొలి ఎంపికైన తొలి ఫైటర్ పైలట్‌గా చరిత్రకెక్కనుంది.

UP 1st Govt Bbus Women Driver : యూపీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌ ‘ప్రియాంక శర్మ’

డిసెంబరు 27న పుణె ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ కోసం సానియా చేరనున్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. టీవీ మెకానిక్ గా పనిచేస్తున్న సానియా తండ్రి షాహిద్ అలీ తన కూతురు ఘతనను చూసి మాటలు రావటంలేదని ఉద్వేగానికి గురి అవుతున్నారు. నా బిడ్డ కష్టం ఫలించింది అంటూ ఆనందపడిపోతున్నారు. ‘‘దేశంలోని తొలి మహిళా ఫైటర్ పైలట్ అవని చతుర్వేదిని రోల్ మోడల్ గా తీసుకున్న నా కూతురు ఆమె అంత స్థాయికి ఎదిగిన నాచిన్నారి చిట్టితల్లి తల్లిదండ్రులమని చెప్పుకోవటానికి గర్విస్తామని అన్నారు.

మహిళా ఫైటర్ పైలట్‌గా ఎంపికైన రెండో మహిళ నా బిడ్డ సానియా కావటం మా అదృష్టం..అదికూడా ఈ దేశానికి నా బిడ్డ సేవలందింబోతోంది ఇది మరీ ఆనందించాల్సిన విషయం అంటూ ఉద్వేగంగా తెలిపారు.

తన విజయానికి నా తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్ కారణమని తెలిపిన సానియా నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షల్లో మహిళల కోసం కేవలం రెండు ఫైటర్ పైలట్ పోస్ట్‌లే రిజర్వ్ చేశారని..నేను మొదటి ప్రయత్నంలో సీటు చేజార్చుకున్నాను. కానీ నా కలలు నెరవేర్చుకోవటానికి మరింతగా కష్టపడ్డాను..ఇష్టపడి కష్టపడినదానికి ఫలితమే రెండోసారి దక్కించుకున్నానని ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది సానియా.

ముస్లిం సామాజిక వర్గం నుంచి తొలి అమ్మాయిగా మా అమ్మాయి కావటం చాలా ఆనందంగా ఉందని..ఫైటర్ పైలట్ కావాలనే కలను కష్టపడి నెరవేర్చుకుంని..ఎంతోమంది అమ్మాయిలకు నా కూతురు ఆదర్శంగా నిలిచింది అంటూ సానియా తల్లి తబస్సుమ్ మీర్జా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు