సివిల్స్ ప్రిలిమ్స్​ పరీక్ష వాయిదా

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)వాయిదా వేసింది.

UPSC Prelims కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)వాయిదా వేసింది. కోవిడ్ దృష్ట్యా జూన్​ 27-2021న జరగాల్సిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను అక్టోబర్-10,2021న నిర్వహించనున్నట్లు యూపీఎస్​సీ గురువారం విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలిపింది.

కాగా, ఐఏఎస్,ఐసీఎస్,ఐఎఫ్ఎస్ సహా 23 సర్వీసుల్లో నియాకం కోసం ఏటా యూపీఎస్సీ..సివిల్​ సర్వీసెస్​ పరీక్షలను ఏటా ప్రిలిమినరీ, మెయిన్​, ఇంటర్వ్యూ అని మూడు దశల్లో నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. సివిల్స్ ప్రిలిమ్స్​ పరీక్ష వాయిదా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 బెంచ్మార్క్ డిసేబిలిటీ కేటగిరీ ఉన్నవారికి 22 ఖాళీలతో సహా 712 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది.

కొనసాగుతున్న కరోనా సంక్షోభం కారణంగా యూపీఎస్పీ ఇటీవల అనేక పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. SSC CGL మరియు SSC CHSL వంటి ఇతర ప్రభుత్వ నియామక పరీక్షలు కూడా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. COVID కేసుల పెరుగుదల మధ్య పరీక్షను వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు