US lawmakers selfies with PM Modi: మోదీతో సెల్ఫీలు,ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీ పడిన అమెరికా చట్టసభ సభ్యులు

అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మాట్లాడిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు అమెరికన్ చట్టసభ సభ్యులు పోటీ పడ్డారు. కాంగ్రెస్ ప్రసంగం తర్వాత అమెరికా చట్టసభ సభ్యులు ప్రధాని మోదీతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం బారులు తీరారు....

PM Modi autographs

US lawmakers selfies with PM Modi: అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మాట్లాడిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు అమెరికన్ చట్టసభ సభ్యులు పోటీ పడ్డారు. కాంగ్రెస్ ప్రసంగం తర్వాత అమెరికా చట్టసభ సభ్యులు ప్రధాని మోదీతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం బారులు తీరారు.(PM Modi US Visit 2023)

Joe Biden,Modi Cheers:అల్కహాల్ లేకుండా జింజర్ డ్రింక్‌తో జోబిడెన్,మోదీల ఛీర్స్

కొవిడ్ వ్యాక్సినేషన్, మహిళా సాధికారత, భారతదేశం-యూఎస్ సంబంధాలు, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై పీఎం మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. మోదీ ప్రసంగించడం ముగియగానే గ్యాలరీలో కాంగ్రెస్ సభ్యులు 12 మంది స్టాండింగ్ ఒవేషన్‌లు, భారతీయ కమ్యూనిటీ సభ్యులు వేర్వేరుగా నిలబడి చప్పట్లు కొట్టారు.మోదీ ఆటోగ్రాఫ్ తీసుకుని సెల్ఫీలు దిగేందుకు సభ్యులు పరుగెత్తుకొచ్చారు.

Mukesh Ambani, Anand Mahindra:యూఎస్‌ మోదీ విందులో భారతీయ ప్రముఖులు

ప్రధాని మోదీతో సంభాషిస్తున్నప్పుడు భారత్ మాతా కీ జై,వందేమాతరం నినాదాలు వినిపించాయి.ప్రధాని మోదీ తన ప్రసంగం ముగిసిన తర్వాత అమెరికా చట్టసభ సభ్యులకు ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేశారు.‘‘మా మధ్యలో చాలా మంది భారతీయ మూలాలు ఉన్న అమెరికన్లు ఉన్నారు. నా వెనుక ఒకరు చరిత్ర సృష్టించారు’’ అని కమలాహారిస్‌ను ఉద్ధేశించి ప్రధాని మోదీ అన్నపుడు సభ ఒక్కసారిగా నవ్వులు, చప్పట్లతో మారుమోగింది.