User Charges for Train Passengers: రైల్వే ప్రయాణికులు యూజర్ ఛార్జీలు చెల్లించాల్సిందే.. రైల్వే టికెట్ పై అదనంగా రూ.10 నుంచి రూ.35 మేర చెల్లించాల్సి రావొచ్చు.. విమానాశ్రయాల తరహాలో రైల్వేలో కూడా యూజర్ ఛార్జీలు చెల్లించే అవకాశం రావొచ్చు.
ఛార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. త్వరలో కేబినెట్ ఆమోదానికి పంపించే అవకాశం ఉంది. ఎంపిక చేసిన స్టేషన్లలో టికెట్ ధరకు అదనంగా యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.
బోగీల్లో క్లాసుల వారీగా ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయనుంది రైల్వే శాఖ. ఒక్కో తరగతి ప్రయాణికుడి ఒక్కోలా యూజర్ ఛార్జీలు ఉండనున్నట్టు సమాచారం. రూ.10 నుంచి రూ.35 మధ్య యూజర్ ఛార్జీలు ఉంటాయని తెలిసింది.
ప్రస్తుతం దేశంలో 7వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సుమారు 700 నుంచి వెయ్యి స్టేషన్లలో ఈ యూజర్ ఛార్జీలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పట్లో కాదంట.. రైళ్లలో అధిక రద్దీతోపాటు సంబంధిత రైల్వే స్టేషన్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాతే ఈ యూజర్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.