Begging Boy Turns To Crorepati : తాత మరణంతో జీవితమే మారిపోయింది.. భిక్షాటన చేసే బాలుడు కోటీశ్వరుడయ్యాడు

అనాథలా బతుకుతూ భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్న ఆ పదేళ్ల బాలుడి తలరాతే మారిపోయింది. భికారి కాస్తా కోటీశ్వరుడయ్యాడు.

Begging Boy Turns To Crorepati : ఒక్కోసారి మన జీవితంలో మనం ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఊహకందని ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. దెబ్బకి లైఫ్ టర్న్ అయిపోతోంది. అనాథలా బతుకుతూ భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్న ఆ పదేళ్ల బాలుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఓవర్ నైట్ లో అతడి తలరాతే మారిపోయింది. భికారి కాస్తా కోటీశ్వరుడయ్యాడు. ఇదంతా అతడి తాత మరణం వల్లే సాధ్యమైంది.

Also Read..జాక్ పాట్ కొట్టిన భారతీయుడు.. లాటరీలో రూ.24కోట్లు గెలిచాడు

ఆ బాలుడి పేరు షాజేబ్ ఆలమ్. వయసు పదేళ్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరన్ పూర్ జిల్లా పండౌలి గ్రామానికి చెందిన షాజేబ్ ఆలమ్.. తన తల్లిదండ్రులు మరణించడంతో గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన కొన్ని రోజులకు.. అతడి తాత మహమ్మద్ యాకూబ్ చనిపోయాడు. తాత మరణం ఆ బాలుడి జీవితాన్ని మలుపుతిప్పింది. అతడికి అదృష్టం తెచ్చి పెట్టింది. ఎందుకంటే.. వీలునామా ప్రకారం రెండంతస్తుల ఇల్లు, రూ.2 కోట్ల విలువైన భూమి తాత నుంచి మనవడు షాజేబ్ కు వచ్చింది.

Also Read.. Jackpot village olmen : జాక్‌పాట్ వరించిన గ్రామం..గ్రామస్తుల ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7.5 కోట్లు జమ

ఈ విషయం తెలిసిన బంధువులు.. షాజేబ్ కోసం గాలించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు వారి ప్రయత్నం ఫలించింది. బాలుడి ఆచూకీ లభించింది. షాజేబ్ ఆలమ్.. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని కలియార్ మందిరంలో అనాథగా బతుకుతూ భిక్షాటన చేస్తూ కనిపించాడు. వెంటనే అతడిని ఇంటికి తీసుకెళ్లారు. నువ్వు బిచ్చగాడివి కాదు కోటీశ్వరుడివి అని బంధువులు చెప్పడంతో బాలుడు ఆశ్చర్యపోయాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

వాళ్లేం చెబుతున్నారో ముందు అర్థం కాలేదు. ఆ తర్వాత వివరంగా చెప్పడంతో అతడికి అర్థమైంది. తాను కోటిశ్వరుడిని అని తెలుసుకుని బాలుడు మురిసిపోయాడు. ఇకపై తాను అనాథగా భిక్షాటన చేస్తూ బతకాల్సిన అవసరం లేదని హ్యాపీగా ఫీలయ్యాడు. తన కష్టాలన్నీ తీరిపోయినట్లే తెలుసుకుని సంబరపడిపోతున్నాడు. కాగా, బాబుని అతడి అంకుల్ నవాజ్ ఆలమ్ చేరదీశాడు. అతడి సంరక్షణ బాధ్యతలను తీసుకున్నాడు.