కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 4 ను మే 31 వరకు పొడిగిస్తూ ప్రజల సౌకర్యార్ధం అనేక వెసులుబాట్లు కల్పించింది. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న పరిస్ధితులను బట్టి అమలు చేస్తాయని చెప్పింది. అందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో చిరు వ్యాపారులు, ఫంక్షన్ హాల్ యజమానులకు, ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. సామాజిక ఎడబాటు, మాస్కు ధరించడం వంటి కోవిడ్ రక్షణ నిబంధనలు అమలు చేస్తూ వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో తిరిగి కార్యకలాపాలు సాగించుకోవచ్చంది. మే 31 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని చెపుతూ… యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనల సడలింపు విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు
> కంటైన్మెంట్ జోన్లు మినహా… ఇతర ప్రాంతాల్లో వీధి వ్యాపారులు తమ కార్యరలాపాలు ప్రారంభించవచ్చు. రెస్టారెంట్లు, స్వీటు షాపులు హోం డెలివరీ చేసుకోవచ్చు.
> నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు.
> రాష్ట్రవ్యాప్తంగా షాపులు తెరిచేందుకు అనుమతించినందున ఓనర్లు, కస్టమర్లు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. గ్లోవ్స్ ధరించి అమ్మకాలు జరపాలి. షాపుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఈ నిబంధనలు పాటించనట్లయితే దుకాణదార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగీ సర్కారు హెచ్చరించింది.
> రోజు విడిచి రోజు ఒక్కో మార్కెట్ తెరవాలి. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల యంత్రాంగం వ్యాపార మండళ్లకు మార్గదర్శకాలు జారీ చేస్తుంది.
> మ్యారేజీ హాళ్లు తెరచుకోవచ్చు. అయితే పెళ్లికి 20 మంది కంటే ఎక్కువ అనుమతించబోమంది.
> డ్రైక్లీనింగ్ షాపులు, ప్రింటింగ్ ప్రెస్‌లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు.
> కూరగాయల మార్కెట్లు ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తెరచి ఉంచాలి. రిటైల్ వెజిటబుల్ మండీలు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు తెరవాలి. వ్యాపారులు ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు వరకు కూరగాయలు అమ్ముకోవచ్చు.
> వాహనాలకు అనుమతి ఉంటుంది. అయితే కార్లు తదితర వాహనాల్లో డ్రైవర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి. టూ వీలర్లపై ఒక్కరికి మాత్రమే అనుమతి. మహిళలు అయితే ఇద్దరికి అనుమతి. అయితే తప్పక హెల్మెట్, మాస్కు ధరించాలి. త్రీవీలర్ ఆటోలలో డ్రైవర్ కాకుండా ఇద్దరికి మాత్రమే అనుమతి.
> ఢిల్లీ నుంచి వచ్చే వాళ్లను నోయిడా, ఘజియాబాద్‌లో ప్రవేశించేందుకు అనుమతినిస్తాం. అయితే పాసులు ఉన్న వారికే ఈ అవకాశం ఉంటుంది.
Read: లాక్‌డౌన్ మధ్య..ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియలకు వేలాది మంది..కాంగ్రెస్,బీజేపీ నేతలకు కూడా..