Pm Modi
Virtual Election Campaign PM Modi : ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలపైనే అందరి దృష్టి నెలకొంటుంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో యూపీ కూడా ఉంది. ఇక్కడ ఆల్ రెడీ అధికారంలో బీజేపీ ఉందనే సంగతి తెలిసిందే. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు యూపీలో మోహరించి వ్యూహాలు రచిస్తున్నారు. అనూహ్యంగా ఎస్పీ జెట్ స్పీడ్ లా దూసుకొచ్చింది. బీజేపీ పార్టీకి చెందిన కీలక నేతలు బుట్టలో వేసుకుంది. సై అంటే సై అంటోంది. ఆ పార్టీకి ధీటుగా ప్రచారం చేస్తోంది. తాజాగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. వర్చువల్ గా ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2022, జనవరి 31వ తేదీ లక్నో వర్చువల్ ర్యాలీలు జరుగనున్నాయి.
Read More : RGV Tweets : పవన్‌కల్యాణ్‌గారూ.. భీమ్లానాయక్‌తో సబ్ కా బాప్ అని నిరూపించండి..!
ప్రచారంలో సీఎం యోగి, డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ జన్ చౌపల్, ఇతర కీలక నేతలు పాల్గొననున్నారు. ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు జరిగే 5 జిల్లాలు, 21 నియోజక వర్గాల్లో ఈ వర్చువల్ ర్యాలీ ప్రత్యక్ష ప్రసారం కానుంది. షామ్లీ, సహరాన్ పూర్, ముజఫర్‌నగర్, బగ్ పత్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాల్లో వర్చువల్ గా ప్రచారం చేయనున్నారు మోదీ. 98 ప్రాంతాల్లో, 7, 878 పోలింగ్ సెంటర్లు, 49 వేల మంది ఓటర్లు టార్గెట్ గా బీజేపీ నిర్ణయించింది. పలు స్మార్ట్ ఫోన్లకు బీజేపీ ప్రచార లింక్స్ చేసింది. ఐదేండ్ల కాలంలో బీజేపీ సర్కార్ చేసిన పనితీరు, పనులను సీఎం యోగీ వెల్లడించారు. వరుస ట్వీట్లతో పథకాల అమలును తీరును యోగీ వివరించారు. మొత్తం 8 ట్వీట్లతో ప్రభుత్వ పనితీరుపై స్పష్టతనిచ్చారు.
Read More : Vehicle Crash in US : ఆరు వాహనాలు ఢీ..తొమ్మిది మంది మృతి
మరోవైపు… 2022, ఫిబ్రవరి 31వ తేదీ సోమవారం కర్హాల్ అసెంబ్లీ స్థానానికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మెయన్ పురి కలెక్టరేట్ లో నామినేషన్ ఫైల్ చేయడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ధర్డ్ ఫేజ్ లో ఫిబ్రవరి 20వ తేదీన కర్హాల్ లో పోలింగ్ జరుగనుంది. ఎస్పీకి కంచుకోటగా మెయిన్ పురి మెయిన్ పురిలో కర్హాల్ అసెంబ్లీ స్థానంగా ఉంది. తొలిసారి అసెంబ్లీ స్థానానికి అఖిలేష్ పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు శాసన మండలి ద్వారా యోగీ, అఖిలేష్ లు సీఎంలుగా అయ్యారు.