Girl Fights Chain Snatchers : నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. చైన్ స్నాచర్లతో వీరోచితంగా పోరాడిన యువతి, ఎలా చితక్కొట్టిందో చూడండి

ఇద్దరు చైన్ స్నాచర్ల తాట తీసిందో యువతి. ధైర్య సాహసాలతో చైన్ స్నాచర్లను తీవ్రంగా ప్రతిఘటించింది. బైక్ పై వెళ్తున్న దొంగలను గట్టిగా పట్టుకుంది.

Girl Fights Chain Snatchers : దొంగలను చూస్తే ఎవరికైనా భయమే. ఎలాంటి హాని తలపెడతారోనని ప్రాణ భయంతో ఆందోళన చెందుతారు. ఈ భయంతోనే దొంగలను ఎదిరించడానికి చాలామంది సాహసం చేయరు. ప్రాణాలతో బయటపడితే అంతే చాలనుకుంటారు. అయితే, ఆ యువతి అలాంటి రకం కాదు. దొంగలపై తిరగబడింది. వీరోచితంగా పోరాడింది. ధైర్య సాహసాలతో వారిని ప్రతిఘటించింది. వెంటపడి చితక్కొట్టి చుక్కలు చూపించింది.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు చైన్ స్నాచర్ల తాట తీసిందో యువతి. రోడ్డు మీద వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లు యువతి మెడలోని బంగారం దొంగలించేందుకు ప్రయత్నించారు. అమ్మాయి కదా ఈజీగా తమ పని అయిపోతుందని చైన్ స్నాచర్లు అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది.

Also Read..Kamareddy Incident : ప్రేమ పేరుతో ఆకతాయి వేధింపులు, అపరకాళి అవతారమెత్తిన యువతి.. చెప్పుతో చితక్కొట్టేసింది..

ఆ యువతి అపరకాళి అవతారం ఎత్తింది. చైన్ స్నాచర్లను తీవ్రంగా ప్రతిఘటించింది. బైక్ పై వెళ్తున్న దొంగలను గట్టిగా పట్టుకుంది. దీంతో ఆమెను వారు కొంతదూరం ఈడ్చుకెళ్లారు. అయినా ఆ యువతి అదరలేదు, బెదరలేదు. దొంగలను అస్సలు వదిలిపెట్టలేదు.

Also Read..Viral Video: బైకుపై పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ సాహసం… వైరల్ అవుతున్న వీడియో

కింద పడిన తర్వాత కూడా లేచి ఓ దొంగను పట్టుకుంది. దీంతో వారు బైక్ తో సహా కిందపడిపోయారు. ఆ తర్వాత ఓ దొంగను పట్టుకుని చితక్కొట్టిందా యువతి. ఇంతలో ఆమె నాన్నమ్మ కూడా తోడు వచ్చింది. ఆ యువతి ఎదురు తిరగడంతో దొంగలు బిత్తరపోయారు. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక కంగారుపడ్డారు.

చైన్ స్నాచర్లకు చుక్కలు చూపించిన యువతి..(Girl Fights With Snatchers)

కాగా, దొంగలతో యువతి చేసిన పోరాటం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో వైరల్ అయ్యింది. యువతి ధైర్య సాహసాలను, దొంగలతో పోరాడిన తీరుని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నీ గట్స్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈ యువతి చూపిన తెగున అందరికీ ఆదర్శం అంటున్నారు. కాసేపటి తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.