గిన్నిస్ రికార్డ్ కొట్టారు : ఆర్టీసీ బస్సుల పరేడ్

  • Publish Date - February 28, 2019 / 04:58 AM IST

ఉత్తరప్రదేశ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (యూపీఎస్ఆర్‌టీసీ) సంస్థ గిన్నీస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించింది. 500 బస్సులతో భారీ పరేడ్ నిర్వహించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ పేరుతో ఉన్న రికార్డును బద్దలుకొట్టి మరీ.. గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది. 2019, ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ఉదయం కుంభ్ లోగోతో ఉన్న బస్సులు 3.2 కిలోమీటర్ల దూరంలో 500 బస్సులు నిలిచాయి. గిన్నిస్ బుక్ రికార్డుకు చెందిన 70 మంది ప్రతినిధులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.
Read Also : నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం

UPS RTCకి చెందిన రీజియన్ మేనేజర్లకు సంస్థ పలు సూచనలు చేసింది. 18 డివిజన్లకు చెందిన బస్సులు, సిబ్బందిని పంపించాలని ఫిబ్రవరి 27వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. 3.2 కి.మీటర్ల దూరంలో పరేడ్ నిర్వహించడం జరిగిందని, 15 కిలోమీటర్ల స్పీడ్‌తో బస్సులను నడపడం జరిగిందని ప్రయాగ్ రాజ్ డివిజన్ రీజనల్ సర్వీస్ మేనేజర్ వెల్లడించారు.

బస్సు – బస్సు మధ్య 10 -12 మీటర్ల దూరం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. డ్రైవర్లలో నూతనోత్సాహం, సంస్థకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే ఈ రికార్డ్ కోసం ప్రయత్నించినట్లు వివరించారు ఆయన. ఇలాంటి రికార్డుల వల్ల సంస్థ ఉద్యోగుల్లో కూడా జోష్ వస్తుందని తెలిపారు.

Read Also : సుబ్బరాజు బర్త్ డేను పండగ్గా చేసుకున్న జపాన్ ఫ్యాన్స్