Annapurna
Annapurna: వందేళ్ల క్రితం కాశీ నుంచి దొంగిలించబడిన అన్నపూర్ణాదేవి విగ్రహం మళ్లీ యథాస్థలానికి చేరుకుంటోంది. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ఢిల్లీలో కేంద్రం చేతుల మీదుగా అందుకున్న యూపీ ప్రభుత్వం.. కాశీలో ప్రతిష్ఠించనుంది. వందేళ్ల కిందట దొంగిలించబడి.. మొన్నటివరకు కెనడాలో ఉన్న విగ్రహాన్ని ప్రధానమంత్రి, వారణాసి ఎంపీ నరేంద్రమోడీ ఇటీవలే ఇండియాకు తెప్పించారు. స్వతంత్రం రాకముందే మనదేశంలో ఎన్నో విలువైన విగ్రహాలు, కళాఖండాలు, పురాతన వస్తువులను విదేశాలకు దోచుకెళ్లారు. ఈ క్రమంలోనే కెనడా నుంచి అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్రం భారత్‌కు తెప్పించింది.
Read This : PM Modi : అమెరికా నుంచి పురాతన వస్తువులను భారత్ కు తీసుకొస్తున్న ప్రధాని మోడీ
ఢిల్లీలో అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి అప్పగించింది కేంద్ర సాంస్కృతిక శాఖ. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా యూపీ ప్రభుత్వానికి 18వ శతాబ్దం నాటి అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఢిల్లీలో అందజేశారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ జైపూర్ హౌస్‌లో ఘనంగా విగ్రహం అప్పగింత కార్యక్రమం జరిగింది.
Read This : Earthquake in Indonesia : ఇండోనేషియాలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రులు మీనాక్షి లేఖి, అర్జున్ రామ్ మేగ్వాల్, ధర్మేంద్ర ప్రధాన్, హార్డీప్ సింగ్ పూరి, స్మృతి ఇరానీ, మహేంద్ర నాథ్ పాండే, బిల్ వర్మతో సహా పలువురు మాజీ ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి నుంచి ఉత్తరప్రదేశ్ మంత్రులు సురేష్ రాణా, నీలకంట్ తివారి సహా పలువురు అన్నపూర్ణ విగ్రహాన్ని అందుకున్నారు. వందేళ్ల క్రితం వారణాసి నుంచి ఈ విగ్రహం దొంగిలించబడింది.
నవంబర్ 15వ తేదీన కాశీ విశ్వనాథ ఆలయంలో అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్. అక్టోబర్ 15వ తేదీన కెనడా నుంచి న్యూఢిల్లీకి వచ్చిన విగ్రహాన్ని అందుకున్నారు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. సాక్షాత్ పరమశివుడికే ఆహారాన్ని కాశీ అన్నపూర్ణ భిక్షగా వేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అన్నపూర్ణ దేవి ఉంటే ఆకలి బాధలు ఉండవని నమ్ముతారు.
Read This : Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా