Bride Wedding Drama : నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో.. పెళ్లికూతరు పరార్.. ఆమె చెల్లితో పెళ్లి టైమ్ కి బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ.. ఆ తర్వాత..
Uttar Pradesh Bride Eloped : ఓ వరుడికి చిత్రమైన పరిస్థితి వచ్చింది. ఎంచక్కా పెళ్లి చేసుకుందామనుకునే టైమ్ లో పెళ్లి కూతురు జంప్ అయిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ లోని (Uttar Pradesh) బరేలి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
- Shiva
- Published on- June 8, 2026 / 01:12 PM IST
Uttar Pradesh Wedding Chaos Bride Elopes Groom Marries Sister Boyfriend Fight Credit AI Image
Uttar Pradesh: ఓ వరుడికి చిత్రమైన పరిస్థితి వచ్చింది. జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది. ఎంచక్కా పెళ్లి చేసుకుందామనుకునే టైమ్ లో పెళ్లి కూతురు జంప్ (Bride Eloped) అయిపోయింది. ఆ తర్వాత అందరూ కలసి పెళ్లి కూతురు చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. సరే అని అందుకు కూడా పెళ్లికొడుకు, అతని కుటుంబం అంగీకరించింది. తీరా కట్ చేస్తే ఆమెతో పెళ్లి సమయానికి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చాడు. నా గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి ఎలా చేసుకుంటావంటూ మండపంలో గొడవ చేశాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి కూడా నాకు ఈ పెళ్లికొడుకు వద్దు. బాయ్ ఫ్రెండే కావాలని చెప్పి వెళ్లిపోయింది. దీంతో అసలు కథ స్టార్ట్ అయింది.
మీ పిల్లలకు పెళ్లి ఇష్టం ఉందో లేదో అనేది తెలుసుకోకుండా సంబంధం ఎలా మాట్లాడారంటూ పెళ్లికొడుకు కుటుంబసభ్యులు పెళ్లి కూతురు ఫ్యామిలీతో గొడవకు దిగారు. దీంతో ఇంత జరుగుతుందని మాకేం తెలుసు. అయినా మీ ముఖాలకి ఎవరిస్తారు.. ఇక వెళ్లి రండి అంటూ పెళ్లి కూతురు కుటుంబం వాళ్లను అవమానించింది. దీంతో ఇంత అవమానం చేస్తారా అంటూ తిట్ల దండకం స్టార్ట్ చేశారు. అది చినికి చినికి గాలి వానగా మారి పెద్దదైంది. ఇరువర్గాలు పిచ్చపిచ్చగా కొట్టుకున్నాయి. కుర్చీలు విసిరేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు.
అమ్మాయి వాళ్ల ఊళ్లో పెళ్లి మండపం అయ్యేసరికి బలం, బలగం కొంచెం ఎక్కువగానే ఉంది. దీంతో పెళ్లికొడుకు, అతని ఫ్యామిలీ, చుట్టాలని పట్టుకుని గట్టిగా కొట్టారు. పెళ్లికొడుకు తమ్ముడు సహా మరికొందరికి కొంచెం పెద్ద దెబ్బలే తగిలాయి. దీనికి సంబంధించి ఎవరూ ఎవరి మీదా కేసులు పెట్టలేదు కానీ.. చిరిగిన చొక్కాలతోనే వచ్చిన కార్లలో ఇళ్లకు వెళ్లిపోయారు. ఉత్తర్ ప్రదేశ్ లోని (Uttar Pradesh) బరేలి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
