Chicken 31 Eggs in 12 Hours : ఇది కోడా? గుడ్లు తయారు చేసే ఫ్యాక్టరీయా..? 12 గంటల్లో 31 గుడ్లు పెట్టిన కోడిపెట్ట..!

మీ ఇంట్లో గుడ్లు పెట్టే కోడిపెట్ట ఉంటే రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది? ఎన్నేంటీ రోజుకు ఒక్కటే పెడుతుంది అంటారు. కానీ ఓ కోడిపెట్ట మాత్రం ఏకంగా గుడ్లు తయారు చేసే ఫ్యాక్టరీలా ఒకే ఒక్క రోజు కాదు కాదు కేవలం 12 గంటల్లో ఏకంగా 31 గుడ్లు పెట్టింది...! మరీ ఈ కోడిని చూస్తే ఇది కోడా? లేదా కోళ్ల ఫారమా? లేదా గుడ్లు తయారు చేసే ఫ్యాక్టరీ అనిపిస్తోంది.

Chicken 31 Eggs in 12 Hours

Chicken 31 Eggs in 12 Hours : మీ ఇంట్లో గుడ్లు పెట్టే కోడిపెట్ట ఉంటే రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది? ఎన్నేంటీ రోజుకు ఒక్కటే పెడుతుంది అంటారు. కానీ ఓ కోడిపెట్ట మాత్రం ఏకంగా గుడ్లు తయారు చేసే ఫ్యాక్టరీలా ఒకే ఒక్క రోజు కాదు కాదు కేవలం 12 గంటల్లో ఏకంగా 31 గుడ్లు పెట్టింది…! మరీ ఈ కోడిని చూస్తే ఇది కోడా? లేదా కోళ్ల ఫారమా? లేదా గుడ్లు తయారు చేసే ఫ్యాక్టరీ అని అనిపించకమానదు.

ఉత్తరాఖండ్‌లోని ఓ కోడి కేవలం 12 గంటల్లో 31 గుడ్లు పెట్టి షాకిచ్చింది. దీంతో ఈ వింత కోడిని అది పెట్టే గుడ్లను చూడటానికి జనాలు పక్క ఊర్లనుంచి కూడా తరలివస్తున్నారట. అల్మోరా జిల్లా భిక్యాసేన్ అనే గ్రామంలో గిరీశ్‌ చంద్ర బుధాని అనే వ్యక్తికి కొన్ని కోళ్లున్నాయి. వాటిలో ఓ కోడిపెట్ట మాత్రం రోజుకు 31 గుడ్లు పెట్టింది. రోజు అంటూ 24 గంటలు కాదు కేవలం 12 గంటల్లోనే 31 గుడ్లు పెట్టింది. రోజుకు రెండు గుడ్లు పెట్టే ఆ కోడిపెట్ట ఒకే ఒక్క రోజు మాత్రం 12 గంటల్లోనే 31 గుడ్లు పెట్టిందని ‘ఇది మా బంగారు కోడిపెట్ట’ అని తెగ మురిసిపోతున్నారు దాని యజమాని గిరీశ్ చంద్ర..గిరీశ్ తన కోళ్లకు వెల్లుల్లి, వేరుశెనగ అంటే చాలా ఇష్టమని అందుకే వాటినే దాణాగా పెబుతుంటామని తెలిపారు.

మా కోడిపెట్ట 25 (డిసెంబర్ 2022) 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 31 గుడ్లు పెట్టిందని గిరీశ్‌ తెలిపారు. ఈ విషయం కాస్తా స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియటంతో గిరీశ్ ఇంటికి వచ్చారు ఈ వింత కోడిపెట్టను పరిశీలించటానికి. వారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వింత కోడి గురించి తెలిసిన స్థానికులతో పాటు పక్క ప్రాంతాల నుంచి కూడా ఈ కోడిని చూడటానికి గిరీశ్‌ ఇంటికి క్యూ కట్టారట జనాలు..కోడికి కొన్ని కాల్షియం సప్లిమెంట్లు ఇవ్వటం వల్లే ఇన్ని గుడ్లు పెట్టిందంటున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు.