Uttarakhand Cops Rescue Youth
Uttarakhand : దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పలు రాష్ట్రాల్లో నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహంతో నదులు పోటెత్తాయి. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నదీ వరదల్లో కొట్టుకుపోతున్న ఒక యువకుడిని అక్కడి పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారు. హరిద్వార్ లోని రావత్ పూర్ సమీపంలోని కాంగ్రాఘాట్ వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరదలో ఒక యువకుడు కొట్టుకు పోతున్నాడు.
కాంగ్రా ఘాట్ లో నియమించిన బడిన పోలీసులు అది గమనించారు. ఉత్తరాఖండ్ గజ ఈతగాళ్లైన పోలీసులు అతుల్ సింగ్, సన్నీకుమార్ లు వెంటనే నదిలోకి దూకి ఆయువకుడిని ఒడ్డుకు తీసుకు వచ్చారు. కాపాడబడిన యువకుడు హర్యానాలోని సోనిపట్ నినాసి గా గుర్తించారు. పోలీసులు చేసిన ఈ పనిని అందరూ శెహాబాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.
हरिद्वार – रावतपुर भवन, कांगड़ा घाट के पास डूब रहे युवक को देख #UttarakhandPolice के तैराक HC अतुल सिंह व सनी कुमार (जल पुलिस) ने नदी में छलांग लगा दी और युवक को सकुशल बाहर निकाला जिससे उसकी जान बचायी जा सकी। युवक सोनीपत, हरियाणा निवासी है।#UKPoliceHaiSaath #RESCUE @ANINewsUP pic.twitter.com/D94nSNGExH
— Uttarakhand Police (@uttarakhandcops) July 14, 2022