Negative report must : పెళ్లికొచ్చే అతిథులకు కూడా నెగిటివ్ రిపోర్టు ఉండాల్సిందే : ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

ఇప్పటి వరకూ పెళ్లికి కేవలం 20మంది మాత్రమే హాజరవ్వాలని కరోనా ఆంక్షల్లో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లికొచ్చే ఈ 20మంది అతిథులకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

covid curfew negative report must  : కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో పెళ్లిళ్లకు పలు ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు రూపొందించింది. వివాహానికి కేవలం 20 మంది అతిథులే హాజరు అయ్యేలా పెళ్లికి వచ్చే 20 మంది అతిథులు కూడా కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వైరస్ కట్టడి కోసం మరో వారం రోజుల పాటు కర్ఫ్యూను పొడిగించారు. మే 25వతేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఉత్తరాఖండ్ అధికార ప్రతినిధి సుబోద్ ఉనియాల్ చెప్పారు. వివాహాలకు వచ్చే అతిథులు 72 గంటల ముందు చేయించిన కరోనా పరీక్ష నెగిటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంది. అంత్యక్రియలకు కూడా 20మందికి మించి పాల్గొన రాదని, వారందరూ కర్ఫ్యూ పాస్ ను పొందాలని సర్కారు సూచించింది. కర్ఫ్యూ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనేందుకు సర్కారు అనుమతినిచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు