Health Minister Car Accident : కారు బోల్తా..ఆరోగ్యశాఖ మంత్రికి గాయాలు

ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి ధన్​ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ధన్​ సింగ్ రావత్ తన సిబ్బందితో కలిసి తలిసైన్ టౌన్​ నుంచి

Minister

Health Minister Car Accident :  ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి ధన్​ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ధన్​ సింగ్ రావత్ తన సిబ్బందితో కలిసి తలిసైన్ టౌన్​ నుంచి డెహ్రాడూన్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఒక కారు బోల్తా పడగా, మరొకటి దాని పక్కనే ఆగి ఉన్నట్లు ఘటనా స్థలంలొ తీసిన ఫొటోలో కన్పిస్తోంది. ఈ ఘటనలో మంత్రి రావత్​కు స్వల్ప గాయాలయ్యాయి. రావత్ ప్రస్తుతం సేఫ్ గానే ఉన్నారని,ఆయనను ట్రీట్మెంట్ కోసం పాబో హాస్పిటల్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ Sonia Gandhi Meeting : విపక్ష పార్టీలతో సోనియా సమావేశం..టీఎంసీకి ఝలక్