Husband Killed Case : ప్రేమించి పెళ్లి చేసుకుంది.. భర్త షాపులో పనిచేసే 17ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. చివరికి బిగ్ ట్విస్ట్..

Husband Killed Case : వివాహేతర సంబంధాలతో భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది.

Uttarakhand Husband Killed Case

Husband Killed Case : వివాహేతర సంబంధాలతో భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ప్రేమవివాహం చేసుకున్న మహిళ.. భర్త షాపులో పనిచేసే మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్దిరోజుల తరువాత భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేసింది. భర్త మృతిని కారు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఇద్దరు మైనర్లతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది.

Also Read : Hanumakonda District : కారు నుంచి తీవ్ర దుర్వాసన.. డిక్కీ తెరిచి చూడగా షాక్.. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు.. ప్రియుడు మోజులో పడి..

ఉత్తరాఖండ్ లోని రామ్‌నగర్‌కు చెందిన సంజీవ్ కుమార్ (24) టెంట్ హౌస్ వ్యాపారం నిర్వహించేవాడు. ఐదేళ్ల క్రితం సంజీవ్ కుమార్, నిషాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ వివాహంకు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులను ఎదిరించి నిషాను ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే, కొంతకాలం తరువాత భర్త టెంట్ హౌస్‌లో పనిచేసే 17ఏళ్ల బాలుడితో నిషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన నిషా.. అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది.

సంజీవ్ కుమార్ ను హత్య చేసేందుకు తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బాలుడిని పురమాయించింది. దీంతో అతను మరో మైనర్ బాలుడితో కలిసి ఆగస్టు 16న తమలో ఒకరి పుట్టినరోజు వేడుకల పేరుతో నిషా భర్త సంజీవ్‌ను పార్టీకి తీసుకెళ్లేందుకు ఒప్పించారు.

కారులో సంజీవ్ డ్రైవింగ్ చేస్తుండగా వెనుక సీట్లో కూర్చున్న మైనర్ బాలుడు తుపాకీతో సంజీవ్ మెడపై కాల్పులు జరిపాడు. దీంతో సంజీవ్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఇద్దరు మైనర్ బాలురు అక్కడి నుంచి పరారయ్యారు. సంజీవ్ కారు ప్రమాదంలో మరణించినట్లుగా నిషా అందరిని నమ్మించింది.

పోలీసు కేసు కావడంతో నిబంధనల ప్రకారం సంజీవ్ కుమార్ కు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, ఈ పోస్టుమార్టం సమయంలో సంజీవ్ మెడ భాగంలో తుపాకీ తూటాను గుర్తించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి అతని భార్య నిషాను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇద్దరు మైనర్ బాలురతో తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు లోతుగా విచారించగా.. 17ఏళ్ల మైనర్ బాలుడితో నిషా పెట్టుకున్న వివాహేతర సంబంధమే భర్తను హత్య చేసేందుకు కారణమైందని పోలీసులు గుర్తించారు. దీంతో నిషాతోపాటు ఇద్దరు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.