Poonawala
Adar Poonawalla : ఆరు నెలల్లోపు 3 ఏళ్లు పైబడిన పిల్లలందరి కోసం నొవావాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఓ వైపు కరోనా,మరొవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతున్న సమయంలో మంగళవారం సీఐఐ పార్టనర్ షిప్ వర్చువల్ సమ్మిట్ లో పాల్గొన్న సీరం సీఈవో అదార్ పూనావాలా మాట్లాడుతూ… కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాను రాబోయే ఆరు నెలల్లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నొవావాక్స్ ట్రయల్స్ జరుగుతున్నాయని పూనావాలా తెలిపారు.
దేశంలో పిల్లల వ్యాక్సిన్ కోసం ఇప్పటికే రెండు కంపెనీలకు లైనెన్స్ ఇచ్చారని, త్వరలోనే చిన్నారులకు టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తప్పనిసరిగా వాక్సిన్ వేయించాలని, వారికి ఎలాంటి హాని ఉండదని సూచించారు. టీకాలు సురక్షితమైనవని, ప్రభావవంతమైనవని స్పష్టం చేశారు. కాగా,ప్రస్తుతం దేశంలో ఉపయోగిస్తున్న రెండు కోవిడ్ వ్యాక్సిన్లు కోవిషీల్డ్,కోవాగ్జిన్ లు 18 ఏళ్లు పైబడిన వారికోసమేనన్న విషయం తెలిసిందే.
ఇక,ఒమిక్రాన్ వేరియంట్ పై పూనావాలా స్పందిస్తూ…అందుబాటులో ఉన్న డేటా ప్రకారం బూస్టర్ వ్యాక్సిన్ లు అవసరమేనని తెలిపారు. అయితే అదృష్టవశాత్తు పిల్లల్లో తీవ్రమైన ఇబ్బందులు కనిపించడం లేదని పూనావాలా అన్నారు.
ALSO READ UP Election : మోదీతో పాటు యోగి గంగానదిలో ఎందుకు స్నానం చేయలేదంటే..