మోడీ నియోజకవర్గంలో బిల్లుల మోత : స్కూల్ కరెంట్ బిల్లు 618 కోట్లు

  • Publish Date - September 5, 2019 / 12:10 PM IST

ఉత్తరప్రదేశ్ ఓ ప్రైవేట్ పాఠశాలకు వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే గుండె ఆగిపోతుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో  ఏకంగా రూ.618 కోట్ల కరెంట్ బిల్లు వేశారు. ఈ బిల్లు సంవత్సరాలది కాదు, ఒక నెల బిల్లు మాత్రమే. ఆ బిల్లు చూసిన పాఠశాల యాజమాన్యం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన వారణాసిలోని వినాయక్ కాలనీలో జరిగింది. 

అయితే ఈ ఘటనపై విద్యుత్ అధికారులకు పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అధికారులు… ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా..ఈ నెల 7వ తేదీ లోపు కరెంట్ బిల్లు కట్టకపోతే పాఠశాలలో కరెంటు నిలిపివేస్తామని నోటీసు కూడా జారీ చేశారు. 

దీంతో ఈ బిల్లును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది. అంతేకాదు మోడీ నియోజక వర్గంలో బిల్లుల మోత అని నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.