బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లా ఎన్నికల అధికారికి BSNLలేఖ రాసింది.ఫిలిబిత్ లోని వరుణ్ గాంధీ ఆఫీస్ లోని ఫోన్ కు సంబంధించిన 38వేల616రూపాయల బిల్లును ఆయన చెల్లించలేదని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.అనేకసార్లు కోరినప్పటికీ వరుణ్ గాంధీ ఇప్పటికీ ఫోన్ బిల్లు చెల్లించలేదని తెలిపింది.
ఫిలిబిత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుణ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.గత ప్రధాన మంత్రుల్లో ఎవరూ కూడా మోడీ లాగా మన దేశానికి కీర్తి, ప్రతిష్ఠలు తీసుకురాలేదన్నారు.