Vasan Eye Care founder AM Arun passes away : తమిళనాడుకు చెందిన వాసన్ ఐ కేర్ వ్యవస్థాపకులు ఏఎమ్ అరుణ్ (51) గుండెపోటుతో కన్నుమూశారు. తిరుచ్చి నుంచి హెల్త్ కేర్ లో కెరీర్ ప్రారంభించిన ఆయన చెన్నైలో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అరుణ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో నగర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
సోమవారం ఉదయం ఆయనకు ఛాతిలోనొప్పిగా అనిపించడంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తెయ్నామ్ పేటలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆయన మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం అరుణ్ మృతదేహాన్ని ఒమన్ దూరర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు.
పోస్టుమార్టం అనంతరం ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అరుణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బంధువుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం సమయంలో ఆత్మహత్య చేసుకోవడం లేదా హత్య వంటి ఎలాంటి ఆధారాలు లేవని పోస్టమార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు.
https://10tv.in/looking-at-a-new-code-for-news-channels-javadekar/
సాధారణ మరణంలానే కనిపిస్తోందని చెప్పారని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. పోస్టమార్టం రిపోర్టు వచ్చాక తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
అరుణ్.. ప్రారంభంలో తిరుచీలో తన కుటుంబంతో కలిసి మెడికల్ షాప్ రన్ చేశారు. ఆ తర్వాత నగరంలో వాసన్ ఐ కేర్ పేరుతో ఆస్పత్రిని నెలకొల్పారు.
కొన్ని ఏళ్ల తర్వాత వాసన్ ఐ కేర్ అతిపెద్ద నెట్ వర్క్ హాస్పిటల్ గా అవతరించింది. దేశవ్యాప్తంగా వాసన్ ఐ కేర్ సెంటర్లు, వాసన్ డెంటల్ కేర్ సెంటర్లు మొత్తం 100 ఆస్పత్రులు రన్ అవుతున్నాయి.