Vegetable Prices Soar In The Bengaluru City
Vegetable Prices Bengaluru : కిలో టమాట రూ. 66, ఉల్లిగడ్డ రూ. 50, కిలో క్యారెట్ రూ. 75 ధరలు పలుకుతున్నాయి. కూరగాయల ధరలు మండుతుండడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏం కొనాలో..ఏం తినాలో అర్థం కావడం లేదంటున్నారు. వీటి ధరలే కాకుండా..ఇతర కూరగాయల ధరలు కూడా అధికంగా ఉంటున్నాయి. వర్షకాలంలో కూరగాయాల ధరలు పెరగడం సర్వసాధరణమేనని, కొన్ని రోజుల తర్వాత పరిస్థితిలో మార్పు ఉంటుందని అధికారులు అంటున్నారు.
Read More : Record Prices : వామ్మో.. సిలిండర్ ధర రూ.2వేల 657, కిలో పాలు రూ. 1,195.. భారీగా పెరిగిన ధరలు
కర్నాటక రాజధాని బెంగళూరులో neghbouring జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో కూరగాయలు ధరలు పెరిగాయి. ధరలు పెరగడానికి రెండు కారణాలు వెల్లడించారు Hopcoms మేనేజింగ్ డైరెక్టర్ ఉమేశ్ మిర్జీ. వర్షాల పంట పాడవుతుందని, అంతేగాకుండా…వేసవిలో టమాట సాగు ఎక్కువ కావడం కారణమని చెప్పారు. పొరుగున్న ఉన్న ఏపీ రాష్ట్రంలో టమాటలు ఇక్కడకు రావడం జరుగుతుంటాయని అయితే…ఆ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా…పంట సరఫరాపై పెను ప్రభావం చూపెట్టిందన్నారు. టమాటలే కాకుండా..ఉల్లి ధర కూడా అమాంతం పెరిగింది. చిత్రదుర్గ, ధార్వాడ్ లో భారీ వర్షపాతం కారణంగా..పంట ఆశించిన స్థాయిలో లేదనే నివేదికలు సూచిస్తున్నాయని..ఉల్లి ధర ప్రస్తుతం కిలోరూ. 47గా ఉందని తెలుస్తోంది.
Read More : Corona : ఇప్పటి వరకు కరోనా సోకనివారు జాగ్రత్త : టీ. ఆరోగ్య శాఖ
ఉల్లిపాయలు, టమాట ధరలు పెరగడానికి కారణం తేమ అని అంటున్నారు. ఎక్కువ తేమకు గురయినట్లైతే…ఉల్లి చుట్టూ..నల్లటి ఫంగస్ ను అభివృద్ధి చేస్తాయి. తేమకు గురయినట్లయితే..టమాట, ఉల్లిగడ్డలు తొందరగా చెడిపోతాయని..ఫలితంగా ధరలు పెరుగుతాయి. ధరల పెరుదల తాత్కాలికమేనని..వర్షాలు తగ్గిన అనంతరం ధరలు దిగి వస్తాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కూరగాయలు బయట ఉంచినందున..తేమకు గురి కావడం, టోకు మార్కెట్ లో ధరలు తక్కువగా ఉండొచ్చు..కానీ..రిటైల్ మార్కెట్ లో ఎక్కువగా ఉంటాయని మరో వ్యాపారి తెలిపారు.