Kerala: భారత్ జోడో యాత్రకు చందా ఇవ్వనందుకు కూరగాయల వ్యాపారిపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం

ఈ విషయమై బాధితుడైన కూరగాయల వ్యాపారి ఎస్.ఫజాస్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ కార్యకర్తల గ్రూప్ ఒకటి షాపుకి వచ్చి భారత్ జోడో యాత్రకు డబ్బులు అడిగారు. నేను 500 రూపాయలు ఇచ్చాను. కానీ వారు 2,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని నేను బతిమాలుకున్నాను. కానీ వారు వినకుండా వెయింగ్ మిషన్, కూరగాయలు విసిరికొట్టారు. నన్ను బెదిరించారు. తిట్టారు’’ అని తెలిపాడు.

Vegetable shop owner threatened by Congress workers for not contributing Rs 2000 for Bharat Jodo Yatra

Kerala: కాంగ్రెస్ పార్టీ కాలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాత్ర ఒకవైపు ఉత్సాహంగానే జరుగుతున్నప్పటికీ మరొకవైపు యాత్ర కోసం పార్టీ కార్యకర్తలు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేథ్యంలో తాజాగా కేరళలో వెలుగు చూసిన ఒక ఘటనకు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రాహుల్ యాత్రకు 2,000 రూపాయల చందా ఇవ్వనందుకు ఒక కూరగాయల వ్యాపారిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేశారు.

రాష్ట్రంలోని కొల్లాం పట్టణంలోజరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భారత్ జోడో యాత్రకు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు చందాలు వసూలు చేస్తున్నారట. ఇందులో భాగంగా కొల్లాం కాంగ్రెస్ నేతలు స్థానిక కూరగాయల మార్కెట్‭లో వసూళ్లు చేస్తుండగా.. ఒక వ్యాపారి చందా ఇచ్చేందుకు విముకత వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా కాంగ్రెస్ కార్యకర్తలు అతడి కూరగాయల్ని చెల్లచెదురుగా పడేశారు. అతడికి బెదిరింపులు చేశారు.

ఈ విషయమై బాధితుడైన కూరగాయల వ్యాపారి ఎస్.ఫజాస్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ కార్యకర్తల గ్రూప్ ఒకటి షాపుకి వచ్చి భారత్ జోడో యాత్రకు డబ్బులు అడిగారు. నేను 500 రూపాయలు ఇచ్చాను. కానీ వారు 2,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని నేను బతిమాలుకున్నాను. కానీ వారు వినకుండా వెయింగ్ మిషన్, కూరగాయలు విసిరికొట్టారు. నన్ను బెదిరించారు. తిట్టారు’’ అని తెలిపాడు.

Karnataka: తీవ్ర నిరసనల మధ్య కర్ణాటక ఎగువ సభలో వివాదాస్పద మత మార్పిడి బిల్లుకు ఆమోదం