Karnataka: తీవ్ర నిరసనల మధ్య కర్ణాటక ఎగువ సభలో వివాదాస్పద మత మార్పిడి బిల్లుకు ఆమోదం

గత నెలలో హిమాచల్ అసెంబ్లీ సైతం ఇలాంటి బిల్లునే ఆమోదించింది. ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ బిల్ పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లును హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. వీటికి ముందు మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఈ బిల్లుల్ని తీసుకువచ్చాయి. దేశంలో లవ్ జిహాదీ పేరిటి మత మార్పిడిలు జరుగుతున్నాయని, ప్రేమ పేరుతో యువతుల్ని మహిళల్ని ఇస్లామీకరిస్తున్నారని ఈ బిల్లుల్ని ప్రవేశ పెట్టే సమయంలో బీజేపీ నేతలు బహిరంగంగానే చెప్పడం గమనార్హం

Karnataka: తీవ్ర నిరసనల మధ్య కర్ణాటక ఎగువ సభలో వివాదాస్పద మత మార్పిడి బిల్లుకు ఆమోదం

Karnataka Upper House Passes Controversial Anti Conversion Bill

Karnataka: తీవ్ర నిరసనల నడుమ వివాదాస్పద ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ బిల్-2021కు కర్ణాటక ఎగువ సభ ఆమోదం తెలిపింది. చాలా రోజుల క్రితమే మంత్రి మండలి చేత ఆమోదం పొందినప్పటికీ.. విపక్షాల కారణంగా బిల్లును అసెంబ్లీ వరకు తీసుకురాలేదు. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. గురువారం బిల్లును ముందుగా ఎగువ సభలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకుంది బొమ్మై ప్రభుత్వం. ఇక దిగువ సభలో ప్రభుత్వానికి ఎలాగూ మెజారిటీ ఉంటుంది కాబట్టి.. అక్కడ సునాయాసంగానే బిల్లు పాస్ చేయించుకుంటామనే ధీమాలో ప్రభుత్వం ఉంది. కాగా, ఈ బిల్లు పెట్టగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన అనంతరం కర్ణాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి మాట్లాడుతూ మత మార్పిడి నిరోధక బిల్లుతో ఎవరినీ మతం మారకుండా అడ్డుకోవడం ఉద్దేశం కాదని, కేవలం బలవంతపు మత మార్పిడులను మాత్రమే అడ్డుకునే ప్రయత్నంలో తీసుకువచ్చిందని అన్నారు. ‘‘ఐచ్ఛికంగా మతం మారాలనుకునే వారి కోసం మేము ఎలాంటి చట్టం తీసుకురావాలని అనుకోవడం లేదు. అయితే బలవంతపు మతమార్పిడిని మాత్రం అడ్డుకుని తీరాల్సిందే. మతాన్ని కాపాడేందుకు విశ్వాసాన్ని రక్షించేందుకు మేం ఈ బిల్లును తీసుకువచ్చాం’’ అని ఆయన అన్నారు.

గత నెలలో హిమాచల్ అసెంబ్లీ సైతం ఇలాంటి బిల్లునే ఆమోదించింది. ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ బిల్ పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లును హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. వీటికి ముందు మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఈ బిల్లుల్ని తీసుకువచ్చాయి. దేశంలో లవ్ జిహాదీ పేరిటి మత మార్పిడిలు జరుగుతున్నాయని, ప్రేమ పేరుతో యువతుల్ని మహిళల్ని ఇస్లామీకరిస్తున్నారని ఈ బిల్లుల్ని ప్రవేశ పెట్టే సమయంలో బీజేపీ నేతలు బహిరంగంగానే చెప్పడం గమనార్హం. అయితే ఈ బిల్లుల్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో తీసుకువచ్చింది.

KTR Over LG Medical College Rename: గాంధీ పేరును కూడా మోదీ అని మార్చేస్తారు.. మెడికల్ కాలేజీ పేరు మార్పుపై కేటీఆర్ ఫైర్