Uttarakhand Road Accident : ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిపోయిన వాహనం, డ్రైవర్ సహా ఆరుగురు గల్లంతు

ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదుగురిని రక్షించారు.

Vehicle Fell Into Valley : ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. సోన్‌ప్రయాగ్ నుంచి రిషికేశ్ తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదుగురిని రక్షించారు.

మిగిలిన ఆరుగురి ఆచూకీ లేదు. ఆచూకీ లేనివారిలో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన జే.రవి రావు ఉన్నారు. ఆయన భార్య కళ్యాణిని రెస్క్యూ సిబ్బంది రక్షించి చికిత్స కోసం రిషికేశ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వర్షాల కారణంగా పర్వతాల మీది నుంచి ఒక్కసారిగా బండరాయి దొర్లుకుంటూ వచ్చింది.

Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్యూటీలోఉన్న ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ మృతి

బండరాయిని తప్పించే ప్రయత్నంలో మ్యాక్స్ వాహనం అదుపు తప్పింది. రోడ్డు మీది నుంచి లోయలో ప్రవహించే నదిలో పడిపోయింది. వాహన డ్రైవర్ సహా ఆరుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది ఐదుగురిని రక్షించి రిషికేశ్ ఆస్పత్రికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు