ISRO Shukrayaan : నిప్పుల కొలిమిలాంటి వీనస్ పై జీవరాశి ఉందా? శుక్రయాన్‌ యోచనతో భారత్ పై ప్రపంచ దేశాల దృష్టి

అది భూమికి సిస్టర్‌ లాంటిది. ఒకప్పుడు భూమిలానే అక్కడ కూడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది. కానీ ఆ గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉండడంతో సముద్రాలు ఆవిరైపోయాయి. జీవరాశి మొత్తం కనుమరుగు అయిపోయింది. అయితే ఇప్పుడు వీనస్‌పై జీవరాశి మనగడకు అవకాశముందన్న వాదనలు తెరపైకొచ్చాయి. శుక్రయాన్‌ ప్రయోగం తర్వాత అది నిజమో.. కాదో అన్నది తేలిపోనుంది.

ISRO Shukrayaan  : అది భూమికి సిస్టర్‌ లాంటిది. ఒకప్పుడు భూమిలానే అక్కడ కూడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది. కానీ ఆ గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉండడంతో సముద్రాలు ఆవిరైపోయాయి. జీవరాశి మొత్తం కనుమరుగు అయిపోయింది. అయితే ఇప్పుడు వీనస్‌పై జీవరాశి మనగడకు అవకాశముందన్న వాదనలు తెరపైకొచ్చాయి. శుక్రయాన్‌ ప్రయోగం తర్వాత అది నిజమో.. కాదో అన్నది తేలిపోనుంది.

శుక్రుడు సౌర వ్యవస్థలో ముందు వరుసలో ఉంటాడు. దీనికితోడు గ్రీన్‌ హౌస్‌ ప్రభావం కారణంగా ఆ గ్రహం హాట్‌ గ్యాస్‌ బెలూన్‌లా కార్బన్‌ డై యాక్సైడ్‌తో నిండిపోయి ఉంటుంది. అంతేకాదు 462 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిప్పుల కొలిమిని తలపిస్తుంది. అలాంటి గ్రహం మానవ మనుగడకు ఏమాత్రం పనికిరాదన్న భావనతో పెద్దగా శాస్త్రవేత్తలెవరూ దాన్ని పట్టించుకోలేదు. అక్కడ మన మనుగడకు కావాల్సిందేదీ ఉండదని తేల్చేశారు. దానిపై ప్రయోగాలు చేయడం వల్ల సమయం, డబ్బు ఖర్చు తప్ప ఏదీ ఉండదని అనుకున్నారు. కానీ తాజా పరిశోధనల్లో అక్కడ జీవరాశికి ఆస్కారం ఉందనే వాదన తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి సమయంలో ఇస్రో శుక్రయాన్‌ ప్రయోగం చేయాలని నిర్ణయించడంతో.. అందరి దృష్టి మనపై పడింది.

Also read : ISRO Shukrayaan-I : వీనస్ గ్రహంపై ఫోకస్ పెట్టిన ఇస్రో..రహస్యాల గుట్టు విప్పుతామంటున్న శాస్త్రవేత్తలు

సోలార్‌ ఎనర్జీతో పాటు గ్రహం ఉపరితలం నుంచి థర్మల్‌ ఎనర్జీ పుట్టడం, కాంతి తరంగదైర్ఘ్యం కారణంగా ఫొటోసింథటిక్‌ పిగ్మెంట్స్‌ను వీనస్‌పై గుర్తించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది భూమిపై సూర్య కిరణాలు ఏర్పడే ప్రక్రియలానే ఉంటుంది. వీనస్‌పై ఫాస్ఫీన్‌ గ్యాస్‌ను గుర్తించడం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్ఫైన్ కనుగొనడం ఇదే మొదటిసారి. అయితే శుక్ర గ్రహం మీదే ఇంత ఆసక్తి ఎందుకంటే.. ఇది మనకు సమీపంగా ఉండటమే కాక.. పరిమాణంలో భూమికి సమానంగా ఉంటుంది. అంతేకాదు గత అధ్యయనాలు ఇక్కడ చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని.. లావా ప్రవాహాల సంకేతాలతో సహా గుర్తించాయి. అసలక్కడ జీవం ఉండడానికి ఆస్కారమే లేదన్న మొదట్లో ఎందుకు అనుకున్నారంటే.. అక్కడి వాతావరణంలో 96 శాతం కార్బన్‌ డయాక్సైడే ఉంటుంది. కానీ ఇప్పుడు జీవరాశి మనుగడకు అవకాశం ఉందనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Also read : ISRO Rockets: చంద్రయాన్ 3 సహా 19 ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో

ఇప్పటికే చంద్రుడు, అంగారకుడిపై అనేక పరిశోధనలకు చాలా విషయాలు మనకు తెలిశాయి. కానీ వీనస్‌ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. దాదాపుగా 462 డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ దిగిన స్పేస్‌ ప్రోబ్‌లు నిమిషాల్లోనే చెడిపోయాయి. అలాంటి గ్రహంలో రహస్యాల గుట్టు విప్పుతానంటోంది ఇస్రో. సాధారణంగా శుక్రుడి మీద ఉండే మేఘాలు 75-95 శాతం సల్ఫ్యూరిక్‌ ఆమ్లంతో నిండి ఉంటాయి. భూమి మీద ఉన్న జీవంలాంటిది ఇక్కడ ఉండటం దాదాపుగా అసాధ్యం. అయితే ఫాస్ఫీన్‌ ఏర్పడటానికి అగ్నిపర్వతాలు, పిడుగులు, ఉల్కలు కారణం అయి ఉండొచ్చు. ఈ మిస్టరీ మొత్తం వీడాలంటే ఇస్రో ప్రయోగం వరకు వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు