Chandigarh : చికెన్ కర్రీలో బతికున్న పురుగు.. మూడేళ్లుగా సాగుతున్న కేసులో తాజాగా తీర్పు.. ఏంటంటే?

రెస్టారెంట్‌కి వెళ్లిన ఓ మహిళ ఆర్డర్ ఇచ్చిన చికెన్ కర్రీలో బతికున్న పురుగును చూసింది. రెస్టారెంట్ సిబ్బంది నచ్చచెప్పాలని చూసినా ఆమె న్యాయ పోరాటానికి దిగింది. చివరికు ఏమైంది?

Chandigarh : చికెన్ కర్రీలో బతికున్న పురుగు.. మూడేళ్లుగా సాగుతున్న కేసులో తాజాగా తీర్పు.. ఏంటంటే?

Chandigarh

Updated On : September 22, 2023 / 11:59 AM IST

Chandigarh : చండీగఢ్‌లోని ఓ రెస్టారెంట్‌లో మహిళ ఆర్డర్ ఇచ్చిన చికెన్‌లో బతికున్న పురుగును చూసింది. హోటల్ యాజమాన్యానికి, మహిళకు మధ్య జరిగిన గొడవ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వరకూ వెళ్లింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ కేసులో చివరకు ఏం జరిగిందంటే?

Bird Flu : చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా? ప్రమాదాలు, జాగ్రత్తలు

చండీగఢ్‌కి చెందిన రంజోత్ కౌర్ అనే మహిళ 2020 సెప్టెంబర్ 14 న చిల్లీస్ అనే రెస్టారెంట్ కి వెళ్లింది. చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చిన ఆమె కూర తింటుండగా అందులో బతికున్న పురుగును చూసి షాకయ్యింది. వెంటనే మేనేజర్‌కి చెబితే అతను సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. ఆమె వీడియో తీస్తుంటే అడ్డుకున్న హోటల్ సిబ్బంది కూరను తీసుకెళ్లి బయట పడేసారు. ఈ విషయం వదలకూడదని గట్టిగా నిర్ణయించుకున్న రంజోత్ కౌర్ రెస్టారెంట్‌కు లీగల్ నోటీసులు పంపించింది. ఇక ఈ కేసు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వరకూ వెళ్లింది. తమ రెస్టారెంట్‌కి ఉన్న మంచి పేరు చెడగొట్టాలని రంజోత్ కౌర్ ఇలా చేసిందంటూ హోటల్ యాజమాన్యం ఆరోపించింది.

Tandoori chicken ice cream : తందూరి చికెన్ ఐస్ క్రీం .. తింటే ఏమవుతుందో?

మూడేళ్లగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని రుజువు కావడంతో జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ రెస్టారెంట్‌కు రూ.25,000 జరిమానా విధించింది. చాలామంది ఇలాంటి అంశాలను తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ రంజోత్ కౌర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. మూడు సంవత్సరాల కాలం తీసుకున్నాతప్పు చేసి బుకాయించిన రెస్టారెంట్ పరిహారం కట్టేలా చేసింది.