Viral Video : ఆడి కారులో వచ్చి మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న రైతు.. ఎక్కడంటే?

కేరళకు చెందిన రైతు సుజిత్ ఆడి కారులో వచ్చి మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సుజిత్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Kerala farmer

Viral Video : ఓ రైతు ఆడి కారులో మార్కెట్‌కి వచ్చి రోడ్ సైడ్ కూరగాయలు అమ్ముతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Vegetable Cultivation : ప్రకృతి విధానంలో కూరగాయల సాగుతో స్వయం ఉపాధి పొందుతున్న రైతు

ఇన్‌స్టాగ్రామ్‌లో  variety_farmer అనే అకౌంట్‌కి  వెళ్తే రైతు సుజిత్ వీడియోలు కనిపిస్తాయి. సుజిత్ వీడియోలు జనాల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. రీసెంట్‌గా పోస్ట్ చేసిన వీడియోలో  సుజిత్ తన పొలంలో పండించిన ఎర్ర తోటకూరను తన లగ్జరీ కారులో మార్కెట్‌కి తీసుకువచ్చినట్లు వీడియోలో కనిపిస్తుంది.  కారుని పక్కకు ఆపి తన వెంట తెచ్చిన ఎర్ర తోటకూరను రోడ్ సైడ్ విక్రయించడం కనిపిస్తుంది. అమ్మడం పూర్తి కాగానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Bananas Flour : అరటితో అద్భుతాలు.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు

సుజిత్ వీడియో 6 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతోంది. నెటిజన్లు ఈ వీడియోను చాలా ఇష్టపడ్డారు. ‘భారతదేశంలో రైతు బిడ్డలందరూ ఇలాగే స్థిరపడాలని.. తాజా కూరగాయలు పండించి అమ్మాలి.. గౌరవించండి’ అని ఒకరు.. ‘నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేయి.. కృషి, అంకితభావంతో పనిచేస్తే విజయం లభిస్తుంది’ అని మరొకరు ఇలా వరుసగా కామెంట్లు పెట్టారు. రైతు సుజిత్ వీడియో వైరల్ అవుతోంది.