Video: ఆకలి బాధతో అల్లాడిపోతున్నప్పటికీ ఇతడు చేసిన పనికి ప్రపంచం ఫిదా

రోడ్డుపైనే ఆ ఆహారాన్ని తింటున్నాడు ఆ వ్యక్తి. ఇంతలో కొన్ని..

Video: ఆకలి బాధతో అల్లాడిపోతున్నప్పటికీ ఇతడు చేసిన పనికి ప్రపంచం ఫిదా

Updated On : July 8, 2024 / 6:49 PM IST

ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలని ఎన్నో తప్పుడు పనులు చేస్తుంటారు మనుషులు. పేదల నోటికాడి ఆహారాన్ని కూడా లాక్కుని తినే రాక్షసులు సమాజంలో ఉన్నారు. అటువంటిది.. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కూడా లేని ఓ వ్యక్తి మంచి పని చేసి అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు.

ఓ యాచకుడికి కాస్త ఆహారం దొరికింది. రోడ్డుపైనే ఆ ఆహారాన్ని తింటున్నాడు ఆ వ్యక్తి. ఇంతలో కొన్ని వీధి కుక్క పిల్లలు వచ్చాయి. అవి కూడా తనలాగే ఆకలితో ఉన్నాయని ఆ యాచకుడు గమనించాడు. తన వద్ద ఉన్న ఆహారం కొంతే అయినప్పటికీ అందులో నుంచే కుక్క పిల్లలకూ కూడా పెట్టాడు. ఆకలి బాధ ఎలా ఉంటుందో అతడికి తెలుసు.. కాబట్టే మూగ జీవాల ఆకలిని తీర్చడానికి ప్రయత్నించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సంపద లేకపోయినా అతడు తన మంచి గుణంతో అందరితో రారాజు అనిపించుకుంటున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఉన్నదాంట్లోనే కొంత సాయం చేయాలన్న సందేశాన్ని అతడు తన చేష్టలతో ఇచ్చాడని కొందరు అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోకి లక్షల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sach Kadwa Hai (@sachkadwahai)

 Also Read: వామ్మో.. దోసలో బొద్దింకలు, పూరీలో పురుగులు..! హైదరాబాద్ హోటల్స్‌లో దారుణాలు