Viral Video
Funny Prank Viral Video : డబ్బులు చెట్లకు కాస్తాయా? చెట్టు ఊపితే కరెన్సీ నోట్లు కింద పడతాయా? ఆశ పడి తీసుకోవాలనుకున్న ఓ కుర్రాడికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది?
ఇదేదో సీరియస్ వార్త అనుకునేరు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ చిలిపి వీడియో గురించి. కొన్ని ప్రాంక్స్ చూడటానికి భలే అనిపిస్తాయి. అవి సరిగ్గా పేలకపోతే మామూలు రచ్చ జరగదు. కానీ అవి చేసేవారికి మాత్రం డేర్ ఉండాలి. మనం నిలబడిన చోట ఒక చెట్టు ఉండి.. దానిని ఊపుతుంటే కరెన్సీ నోట్లు రాలాయనుకోండి.. మనం తీసుకుంటాం.. ఇక చూసేవారు కూడా తీసుకోకుండా ఉంటారా? చెప్పండి. వైరల్ అవుతున్న ఓ ఫన్నీ ప్రాంక్ వీడియో గురించి చెప్పాలి.
పేవ్‌మెంట్ పక్కన ఉన్న ఓ చెట్టును యువకుడు తన్నడంతో వీడియో మొదలవుతుంది. అంతే చెట్టుపై నుంచి డబ్బులు రాల్తాయి. మరోసారి కాలితో తన్నగానే మరిన్ని నోట్లు పడతాయి. ఇదంతా చూస్తున్నవారికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఇదంతా గమనిస్తున్న ఓ యువకుడు ఆత్రం ఆపుకోలేక ఆశతో చెట్టును కదిలించడానికి ప్రయత్నించాడు. అంతే చెట్టుపై నుంచి అతని మీద నీళ్లు పడ్డాయి. ఇదంతా సరదాగా కొందరు చేసిన ప్రాంక్ అన్నమాట.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో అత్యాశ మంచిది కాదనే మంచి మెసేజ్ ఇస్తోందని నెటిజన్లు ప్రశంసించారు.