Viral Video
Viral Video: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి జమ్మూకశ్మీర్ లోని గుల్మర్గ్ లో స్నోమొబైల్ నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాహుల్, ప్రియాంకా స్నోమొబైల్ పై కూర్చుని మంచుపై ఎంజాయ్ చేయడం ఇందులో చూడొచ్చు.
గత వారం రాహుల్, ప్రియాంక జమ్మూకశ్మీర్ లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. భారత్ జోడో యాత్ర విజయవంతం అయిన నేపథ్యంలో వారు ఇలా జమ్మూకశ్మీర్ లో పర్యటించారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కొన్ని రోజుల క్రితం మంచుతో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఆడుకున్న వీడియో కూడా వైరల్ అయింది.
కన్యాకుమారిలో రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 24 నుంచి ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
RaGa ?? pic.twitter.com/WUfzeK9o52
— Srinivas BV (@srinivasiyc) February 19, 2023
Lok Sabha elections-2024: రాజీపడే ధోరణితో చర్చలు జరపాలి: విపక్షాల ఐక్యతపై చిదంబరం