Bengaluru
Bengaluru : మెట్రోలో పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం, రీల్స్ ఇవన్నీ రొటీన్ అయిపోయాయి. నిబంధనలకు ఇవి విరుద్ధమని అధికారులు మొత్తుకుంటున్నా ప్రయాణికులకు పట్టట్లేదు. రోజూ ఏదో ఒక చోట మెట్రోలో వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరు మెట్రో వార్తల్లో నిలిచింది. ఓ మహిళ మెట్రోలో పల్టీలు కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
మెట్రో కార్పొరేషన్లు రైలు కోచ్‌లలో వీడియోలు షూట్ చేయడంపై నిషేధం గురించి పదే పదే గుర్తు చేస్తున్నా ప్రయాణికులు మాత్రం వీడియోగ్రఫీలో మునిగి తేలుతున్నారు. డిజిటల్ క్రియేటర్, అథ్లెట్ కూడా అయిన ఓ మహిళ బెంగళూరు ట్రైన్‌లో పల్టీలు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిషా శర్మ (mishaa_official_) అనే యూజర్ షేర్ చేసిన వీడియోలో మహిళ రైలు కోచ్‌లో నిలబడి పల్టీలు కొట్టింది. ఇది చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరికి ఆమె చేష్టలు నవ్వు పుట్టించాయి.
Bengaluru : బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు .. చూసేందుకు ఎగబడ్డ స్ధానికులు
ఈ వీడియో చూసిన కొందరు ‘మీ టాలెంట్‌ని భారతదేశం తరపున ఒలింపిక్స్‌లో చూపించండి.. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించకండి’ అని.. ‘యు ఆర్ ది బెస్ట్.. అద్భుతం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఢిల్లీ మెట్రో ఈ సంవత్సర ప్రారంభంలోనే మెట్రోల్లో వీడియోలు చిత్రీకరించవద్దని ప్రయాణికులను కోరింది. పలు చోట్ల వీడియో చిత్రీకరణ గురించి హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా ప్రయాణికులు ఈ ఫీట్లకు చెక్ పెట్టట్లేదు.