Chennai
చెన్నై : నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయనకు చెన్నై MIOT ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆయన సతీమణి సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో విడుదల రిలీజ్ చేశారు.
చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్.. సినీ ప్రముఖులు ఓటు వేసే ప్రాంతాలు ఇవే..
విజయ్ కాంత్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. డయాబెటీస్ తో పాటు లివర్ కి సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటున్నారు. డయాబెటీస్ కారణంగా కొంతకాలం క్రితం వైద్యులు ఆయన కాలి మూడు వేళ్లను తొలగించారు. నవంబర్ 18 న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చెన్నైలోని MIOT ఆసుపత్రికి తరలించారు.
తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై MIOT హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలుగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని, మరో 14 రోజులపాటు చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. విజయ్ కాంత్ పూర్తిగా కోలుకోవడానికి పల్మనరీ చికిత్స చేయాల్సిన ఉంటుందని కూడా వైద్యులు వెల్లడించారు. కాగా విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి ప్రేమలత సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఎటువంటి వదంతులు నమ్మవద్దని, అందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటారని ఆ వీడియోలో పేర్కొన్నారు.
Nithin : హీరో నితిన్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన స్టార్ క్రికెటర్
కొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన పుట్టినరోజు సందర్భంలో పార్టీ కార్యాలయంలో కనిపించిన ఆయనను చూసి కార్యకర్తలు ఆందోళన చెందారు. కొందరు కన్నీరు పెట్టుకున్నారు కూడా. తాజా హెల్త్ అప్ డేట్ వారిని మరింత ఆందోళనలో పడేసింది. విజయ్ కాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
A setback to Actor/Political leader #Vijayakanth ‘s health..
Praying for his speedy recovery.. 🙏 pic.twitter.com/vIVFuM5VRR
— Ramesh Bala (@rameshlaus) November 29, 2023
கேப்டன் நலமாக இருக்கிறார். விரைவில் முழு உடல் நலத்துடன் வீடு திரும்பி, நம் அனைவரையும் சந்திப்பார்.
– திருமதி. பிரேமலதா விஜயகாந்த் pic.twitter.com/P9iHyO7hzG
— Vijayakant (@iVijayakant) November 29, 2023