Nithin : హీరో నితిన్‌కి స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పంపిన స్టార్ క్రికెటర్

హీరో నితిన్‌కు ఓ స్టార్ క్రికెటర్ బహుమతిని పంపారు. ఆ స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌కు సంబరపడిపోయిన నితిన్ ఆ క్రికెటర్‌కు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Nithin : హీరో నితిన్‌కి స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పంపిన స్టార్ క్రికెటర్

Nithin 2

Nithin : హీరో నితిన్‌కు స్టార్ క్రికెటర్ స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పంపించారు. ఆ గిఫ్ట్ అందుకున్న నితిన్ హ్యాపీ ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇంతకీ ఎవరా స్టార్ క్రికెటర్? ఏం గిఫ్ట్ పంపారు?

 

Nithin

Nithin

హీరో నితిన్‌కు స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పంపించారు. బెస్ట్ విషెస్ అంటూ తను సైన్ చేసిన టీ షర్ట్‌ను ధోనీ నితిన్‌కు పంపించారు. గిఫ్ట్ అందుకున్న నితిన్ సంబరపడుతూ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ నుండి ఎక్స్‌ట్రా ఆర్డినరీ గిఫ్ట్.. ధన్యవాదాలు సార్’ అనే శీర్షికతో నితిన్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో నటిస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ కాగా ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఇక ఈ సినిమా నుండి రిలీజైన ‘డేంజర్ పిల్లా’.. ‘బ్రష్ వేసుకో’ పాటలు దుమ్ము రేపుతున్నాయి. ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ధోనీ విషెస్ అందిస్తూ టీ షర్ట్ బహుమతిగా పంపడం నితిన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

నితిన్‌కు భీష్మ సినిమా తర్వాత పెద్దగా హిట్ పడలేదనే చెప్పాలి. 2022 లో వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’ నిరాశనే మిగిల్చింది. చాలా గ్యాప్ తర్వాత నితిన్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్  ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాపై  భారీ అంచనాలున్నాయి. 2023 చివర్లో వస్తున్న ఈ సినిమా నితిన్‌కి హిట్ ఇస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by N I T H I I N (@actor_nithiin)