చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్.. సినీ ప్రముఖులు ఓటు వేసే ప్రాంతాలు ఇవే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ ఓటుతో భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్న పోలింగ్ బూత్ వివరాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్.. సినీ ప్రముఖులు ఓటు వేసే ప్రాంతాలు ఇవే..

Telangana Elections 2023

Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30 న జరగనుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోమని పిలుపునిచ్చారు. ఓటు ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు రేపు ఓటు వేసే ప్రాంతాల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో సిరా చుక్కతో ఓటేసి తమ నాయకుడిని ఎన్నుకునేందుకు జనం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే సామాన్యులు ఓటు వేసేందుకు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. సెలబ్రిటీలు సైతం షూటింగ్స్ నుంచి ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు.

ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం చేశారు. ఎవరు ఎక్కడ ఉన్నా వీలు చేసుకుని వెళ్లి మరి ఓటేయమన్నారు. నటి ఇంద్రజ, నటుడు అదిరే అభి వంటి వారు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. బాగా ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటేయమని పిలుపునిచ్చారు.

Also Read : బాలీవుడ్ మీద నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన మల్లారెడ్డి..

కొద్దిరోజులుగా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో భాగంగా మైసూరులో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఓటు వేయడానికి హైదరాబాద్‌కు వచ్చారు. షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని మరీ రామ్ చరణ్ హైదరాబాద్‌కు రావడం ఓటు హక్కు ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది. మరోవైపు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకోబోయే ప్రాంతాలు అంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : హీరో నితిన్‌కి స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పంపిన స్టార్ క్రికెటర్

సినీ ప్రముఖులు ఓటు వేయడం.. బయటకు వచ్చి సిరా చుక్కను అందరికీ చూపిస్తూ ఫోటోలు దిగడం ఎన్నికల సందర్భంలో సాధారణంగా కనపడే విషయం. ఈసారి కూడా సినీ ప్రముఖులు తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. చిరంజీవి, నాగార్జున, మంచు మోహన్ బాబు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్న ప్రాంతాలు ఇవే..

చిరంజీవి – జూబ్లిహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149)
నాగార్జున – వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ (పోలింగ్ బూత్ 151)
వెంకటేష్ – షేక్ పేట్ ఇంటర్నేషనల్
మంచు మోహన్ బాబు – జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165)
ప్రభాస్ – మణికొండ
మహేష్ బాబు – జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165)
రామ్ చరణ్ – జూబ్లిహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149)
అల్లు అర్జున్ – BSNL సెంటర్ (పోలింగ్ బూత్ 153)
నాగ చైతన్య – వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ (పోలింగ్ బూత్ 151)
జూనియర్ ఎన్టీఆర్ – ఓబుల్‌రెడ్డి స్కూల్ (పోలింగ్ బూత్ 150)
విజయ్ దేవరకొండ – జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 164)
నితిన్ – జూబ్లిహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149)
దగ్గుబాటి రానా – FNCC (పోలింగ్ బూత్ 166)
మంచు లక్ష్మి – జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165)
అనుష్క – షేక్ పేట్ ఇంటర్నేషనల్
బ్రహ్మానందం – షేక్ పేట్ ఇంటర్నేషనల్
అల్లరి నరేష్ – రోడ్ నంబర్.45 ఫైనాన్షియల్ కో-ఆపరేటివ్ సొసైటీ
శ్రీకాంత్ – జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 164)
రాఘవేంద్ర రావు – FNCC (పోలింగ్ బూత్ 164)
అల్లు అరవింద్ – BSNL సెంటర్ (పోలింగ్ బూత్ 153)
విశ్వక్సేన్ – FNCC (పోలింగ్ బూత్ 160)
రాజమౌళి – రోడ్ నంబర్.45 ఫైనాన్షియల్ కో-ఆపరేటివ్ సొసైటీ