మోడీ లాంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరు : విజయశాంతి

  • Publish Date - April 20, 2019 / 03:01 AM IST

బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగు సినీ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ లాంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరంటూ వ్యాఖ్యాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 19, 2019)న కర్ణాటకలోని ముదోళ్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను బీజేపీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని.. అందుకే ఆ పార్టీ నేతల నేపథ్యమేమిటో తెలుసన్నారు. ఓ ప్రధానికి ఉండాల్సిన లక్షణాలు మోదీలో లేవని విమర్శించారు. ఐదేళ్లలో మోడీ కేవలం అబద్ధాలతోనే దేశాన్ని మోసగించారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు రాహుల్‌గాంధీ, మోడీ మధ్య పోరు అని అన్నారు. బీజేపీ ప్రలోభాలకు గురిచేసినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని ప్రజలకు సూచించారు.