Khairatabad Ganesha Statue : ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు ప్రత్యేకలు ఇవే .. రెండు అడుగుల దూరం తప్పనిసరి

ఏ ఏడాది హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతికి చాలా ప్రత్యేకలున్నాయి. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటినుంచి మరో లెక్క అన్నట్లుగా ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణనాధుడు రూపుదిద్దుకుంటున్నాడు.

Khairatabad Ganesha Statue 2022 : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతుంటారు. ఇక ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి పేరుతో కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధిన వివరాలను గణేశ్ ఉత్సవ కమిటీ వివరాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు విగ్రహంలో పలు ప్రత్యేకతలు సంతరించుకున్నాయి.

వాటిలో ముఖ్యంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మట్టితోనే ఖైరతాబాద్ గణేషుడు రూపు దిద్దుకుంటున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ లేకుండానే 50 అడుగుల పొడుగున బొజ్జ గణపయ్య రూపుదిద్దుకుంటున్నాడు. అంతేకాదు సహజ సిద్దమైన రంగులను గణపయ్యకు వినియోగిస్తున్నారు. అలాగే మట్టి విగ్రహం కాబట్టి గణేషుడిని ముట్టుకోకుండానే దూరం నుంచి దణ్ణం పెట్టుకోవాలని కనీసం రెండు అడుగుల దూరం నుంచి దర్శించుకోవాలని ఎట్టిపరిస్థితుల్లోనే విగ్రహాన్ని ముట్టుకోవద్దని కోరుతున్నారు నిర్వాహకులు.

అలాగే లడ్డూ విషయంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఏకంగా 1100ల కేజీల లడ్డూని గణపయ్యకు సమర్పించనున్నారు. లంగర్ హౌస్ కు చెందిన భక్తులు భారీ గణపయ్యకు ఈ భారీ లడ్డూను బహూకరించనున్నారు. ఈక్రమంలో వినాయక చవితి పండుగకు ఇంకా రెండు రోజులే ఉండటంతో దేశమంతా ఈ పర్వదినాన్ని జరుపుకోవటానికి సిద్ధమవుతున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ ఆకృతులతో గణపయ్యలు సిద్ధమవుతున్నారు.

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రత్యేకతలు ఇవే..

శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి విగ్రహం ఎత్తు 50 అడుగులు

ఐదు తలలు, 6 చేతులతో గణేశుడి విగ్రహాన్ని రూపుదిద్దనున్నారు.

అలంకరణ కోసం తలపై ఏడు సర్పాలను ఉంచనున్నారు.

కుడివైపు శ్రీ త్రిశక్తి మహాగాయత్రి , ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రహమణ్యా స్వామి విగ్రహాలు ఏర్పాటుకానున్నాయి.

ముఖ్యంగా సహజ సిద్ధమైన రంగులతో మట్టితో రూపుదిద్దుకుంటున్నా గణనాధుడు..

 

 

ట్రెండింగ్ వార్తలు