Manipur tense again
Manipur – Violence: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో ఆందోళనకారుల్లో చాలా మందికి గాయాలయ్యాయి.
సెప్టెంబరు 16న కొందరు ఆయుధాలతో పట్టుబడడంతో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి నిందితులకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అరెస్టు చేసిన ఐదుగురిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు 48 గంటల పాటు లాక్‌డౌన్ విధించారు.
ఆందోళనకారుల్లో మహిళలూ అధిక సంఖ్యలో ఉన్నారు. కొన్ని నెలలుగా మణిపూర్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు ఆందోళనల కారణంగా 150 మంది ప్రాణాలు కోల్పోయారు.
Truecaller: మోసాల నివారణకు ట్రూకాలర్ ఏఐ రికగ్నైజేషన్ ఫీచర్.. ఓసారి కన్నేయండి